AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Recharge: జియో సిమ్ వాడేవారికి అదిరిపోయే న్యూస్.. ఒక నెల రీఛార్జ్ చేస్కుంటే తర్వాతి నెల ఫ్రీ.. ఇలా చేయండి..

జియో వినియోగదారులకు తీపికబురు. రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. అదే బై వన్ గెట్ వన్ ఆఫర్. అంటే మీరు ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే తర్వాతి నెల ఉచితంగా పొందవచ్చు. దీని వల్ల తర్వాతి నెలలో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల డబ్బులు ఆదా అవుతాయి.

Jio Recharge: జియో సిమ్ వాడేవారికి అదిరిపోయే న్యూస్.. ఒక నెల రీఛార్జ్ చేస్కుంటే తర్వాతి నెల ఫ్రీ.. ఇలా చేయండి..
Jio Recharge
Venkatrao Lella
|

Updated on: Nov 10, 2026 | 3:45 PM

Share

తమ సిమ్ వాడేవారికి జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే మరో నెల రీఛార్జ్ ఉచితంగా పొందవచ్చు. దీనినే వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటారు. అంటే ఒకటి కొంటే మరోకటి ఉచితం అన్నట్లు. మీరు ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే తర్వాతి నెల రీఛార్జ్ చేసుకోకుండా ఉచితంగా లభిస్తుంది. ఇందుకోసం బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను జియో తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే మై జియ్ యాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ యాప్‌లు, ఇతర మార్గాల ద్వారా రీఛార్జ్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్‌కు సంబంధించి జియో తమ కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందిస్తోంది.

భారీగా డబ్బులు ఆదా

జియోలో అందుబాటులో ఉన్న రూ.299, రూ.349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. జియో వినియోగదారులు మై జియో యాప్ ద్వారా ఆ ప్లాన్లను ఎంచుకుని రీఛార్జ్ చేసుకుంటే ఆఫర్ లభిస్తుంది. ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే మరో నెల ఉచితంగా పొందంటం వల్ల తర్వాతి నెల మీరు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల భారీగా డబ్బులు ఆదా అవుతాయి. అయితే మీరు రీఛార్జ్ చేసుకునేముందు ఈ ఆఫర్ మీకు అందుబాటులోకి ఉందా.. లేదా అనేది చెక్ చేసుకోండి. కొంతమందికి ఈ ఆఫర్ వర్తించకపోవచ్చు.

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి..?

-గూగుల్ ప్లే స్టోర్ నుంచి మై జియో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

-అనంతరం మీ మొబైల్ నెంబర్ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వండి

-హోమ్ పేజీలో ఉచిత రీఛార్జ్ ఆఫర్ బ్యానర్ మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది

-అనంతరం రీఛార్జ్ పెండింగ్‌లో ఉన్న నెంబర్లు మీకు కనిపిస్తాయి

-మీ నంబర్‌ను సెలక్ట్ చేసుకుని రూ.299, రూ.349 ప్లాన్లను ఎంచుకోండి

-బై వన్ గెట్ వన్ అని ప్లాన్‌పై రాసి ఉంటే మీకు ఆఫర్ అందుబాటులో ఉందని అర్థం

-ఆ ప్లాన్లను సెలక్ట్ చేసుకుని రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది

ఈ ఆఫర్ ఎవరికి అంటే..?

మీ ప్రస్తుత ప్లాన్ పూర్తయిన తర్వాత ఉచిత ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివ్ అవుతుంది.చాలా రోజులుగా రీఛార్జ్ చేసుకోకుండా ఉన్నవారికి ఈ ఆఫర్ కనిపిస్తుంది. రూ.299, రూ.349 ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. మీరు ఉచిత ఆఫర్ వల్ల 58 రోజుల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఆన్‌లిమిటె్క కాల్స్, రోజుకు 2 జీబీ 5జీ నెట్‌వర్క్ డేటా వంటివి ఇందులో పొందవచ్చు.

Follow Us