Jio: నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..

|

Apr 25, 2024 | 1:28 PM

రిలయన్స్‌ గ్రూప్‌కు చెందిన జియో సినిమా సేవలను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కొన్ని బేసిక్‌ సేవలను ఉచితంగా అందిస్తూ వస్తున్న జియో ఇప్పుడు క్రమంలో సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. జియో సినిమా అందిస్తున్న ఈ ప్లాన్స్‌ ఏంటి.? వీటివల్ల యూజర్లకు కలిగే ప్రయోజనాలు..

Jio: నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
Jio Cinema
Follow us on

రిలయన్స్‌ గ్రూప్‌కు చెందిన జియో సినిమా సేవలను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కొన్ని బేసిక్‌ సేవలను ఉచితంగా అందిస్తూ వస్తున్న జియో ఇప్పుడు క్రమంలో సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. జియో సినిమా అందిస్తున్న ఈ ప్లాన్స్‌ ఏంటి.? వీటివల్ల యూజర్లకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జియో సినిమా రూ. 29, రూ. 89తో రెండు కొత్త ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. రూ. 29 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఒక డివైజ్‌లో ఎలాంటి యాడ్స్‌ లేకుండా కంటెంట్‌కు చూడొచ్చు. 4కే క్వాలిటీ వీడియోలనుతో ఈ ప్లాన్‌లో వీక్షించే అవకాశం కల్పించారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే సినిమాలు, హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను వీక్షించవచ్చు.

ఈ షోలను స్మార్ట్‌ టీవీతో పాటు ఇతర డివైజ్‌లలోనూ చూసే అవకాశం కల్పించారు. కాగా లైవ్‌ టెలికాస్ట్‌లు, స్పోర్ట్స్‌లో మాత్రం ప్రకటనలు వస్తాయి. ఇక జియో అందిస్తున్న మరో రీఛార్జ్‌ ప్లాన్‌ రూ. 89. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో కంటెంట్‌ను చూడొచ్చు. రూ. 29 ప్లాన్‌తో పొందే అన్ని బెనిఫిట్స్‌ను ఇందులో పొందొచ్చు.

ఇప్పటికే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్న వారు ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్‌ అవుతారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ను యాడ్స్‌తో ఉచితంగానే చూడొచ్చు. ఇదిలా ఉంటే జియో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారు ఇంటర్నేషనల్‌ కంటెంట్‌ను స్థానిక భాషల్లో చూసే అవకాశాన్ని కల్పించారు. పలు హాలీవుడ్‌ చిత్రాలను స్థానిక భాషల్లో వీక్షించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..