Jio Value Pack: కస్టమర్లను మరింతగా ఆకట్టకునేందుకు వివిధ టెలికాం కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇక ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ తన జియో కస్టమర్ల కోసం రోజు రోజుకి సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్ల అత్యంత ఆకర్షణీయమైన ప్లాన్‌లను అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకువస్తోంది. అలా తాజాగా మరొక అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది జియో యాజమాన్యం. ‘జియో వాల్యూ ప్యాక్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో రూ. 395 రీఛార్జ్ చేసుకుంటే 6GB హైస్పీడ్ డేటాను పొందుతారు. మూడు నెలల పాటు అంటే 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. వీటితో పాటు రోజుకు 100 SMSలు, అపరిమిత కాలింగ్ సదుపాయాలు ఉంటాయి.
ఎవరికి ప్రయోజనమంటే..
కాగా ఈ ప్లాన్ లో రోజువారీ డేటా సౌకర్యం లేదు. ఇంటర్నెట్ కోసం ఎక్కువగా వైఫై మీద ఆధారపడే వాళ్లకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో వైఫై సౌకర్యంమున్న వాళ్లకు కూడా ఈ ప్లాన్ మంచిగా ఉంటుంది. ఈ రీఛార్జి ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి అన్ని జియో యాప్ ల సబ్ స్క్రిప్షన్లను కూడా పొందవచ్చు.
Also Read:Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. నలుగురి మృతి..
JP Nadda: బీజేపీ ఉన్నచోట మిషన్.. కాంగ్రెస్ ఉన్నచోట కమిషన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేపీ నడ్డా
Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..