Akshaya Tritiya sales: అక్షయ తృతీయ నాడు బంగారం, ఆభరణాలు, విలువైన వస్తువులను కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 3న ఉంది. అనేక సంస్థలు బంగారం (Gold), వెండి (Silver), వజ్రాభరణాలపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ పవిత్రమైన పండుగలో కొన్ని ఉత్తమ ఆఫర్‌లను ఇక్కడ చూడండి.
తనిష్క్ (Tanishq):
తనిష్క్ బంగారం, వజ్రాభరణాల మేకింగ్ ఛార్జీలపై 20 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అప్పుడు సాధారణ ఆభరణాలపై గ్రాముకు రూ. 200 తగ్గింపు ఉంది. అయితే ఇది దేశంలోని తూర్పు జోన్‌కు మాత్రమే. చాలా ప్రాంతాలకు ఈ ఆఫర్‌లు ఏప్రిల్ 24 నుండి మే 4 వరకు చెల్లుబాటులో ఉంటాయి. తనిష్క్ వెబ్‌సైట్‌లో ఆఫర్‌లు, పోటీ విభాగం కింద నిర్దిష్ట వివరాలను తనిఖీ చేయండి.
కారట్లేన్ (Caratlane):
క్యారట్‌లేన్‌లో మీరు అన్ని డిజైన్‌లపై డైమండ్ ధరలపై 20 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు వర్తిస్తుంది.
మలబార్ గోల్డ్ (Malabar Gold):
మలబార్ గోల్డ్ ప్రత్యేకమైన ఆన్‌లైన్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఇక్కడ రూ. 25,000 బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే ఉచిత బంగారు నాణేలను అందిస్తోంది. 25,000 విలువైన వజ్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తే, కంపెనీ రెండు బంగారు నాణేలను అందిస్తోంది. కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
సెంకో గోల్డ్ (Senco Gold):
ఇక సెంకో గోల్డ్ ప్రతి గ్రాము బంగారు ఆభరణాలపై రూ. 224 వరకు తగ్గింపుతో పాటు మేకింగ్ ఛార్జీలపై 50 శాతం తగ్గింపును అందిస్తోంది. వజ్రాభరణాలు, వెండి నాణేల తయారీ ఛార్జీలపై 100 శాతం తగ్గింపు అందిస్తోంది.
జోయాలుక్కాస్ (Joyalukkas):
జోయాలుక్కాస్ రూ. 50,000 విలువైన డైమండ్ లేదా అన్‌కట్ డైమండ్ ఆభరణాలను కొనుగోలు చేస్తే 1 గ్రాముల బంగారు నాణేన్ని ఉచితంగా అందిస్తోంది.
PC జ్యువెలర్స్ (PC Jewellers):
మీరు వెండి ఆభరణాలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపు, డైమండ్ ఆభరణాలపై 30 శాతం తగ్గింపు పొందవచ్చు.
త్రిభోవందాస్ భీమ్‌జీ జవేరి (Tribhovandas Bhimji Zaveri):
త్రిభోందాస్ భీమ్‌జీ జవేరి సంస్థ ఈ అక్షయ తృతీయ నాడు బంగారం, వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది ఏదైనా బంగారంపై 100 శాతం విలువ మార్పిడిని కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ మే 3 వరకు వర్తిస్తుంది.
కాండరే (Candere by Kalyan Jewellers):
రూ. 25,000 పైబడిన ప్రతి కొనుగోలుపై కాండరే సంస్థ ఉచిత బంగారు నాణేలను అందజేస్తున్నారు. ఇది కాకుండా, సాలిటైర్‌లపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపు, బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 60 శాతం వరకు తగ్గింపు, వజ్రాభరణాలపై జీరో మేకింగ్ ఛార్జీలు మరియు ప్లాటినం ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 40 శాతం తగ్గింపును అందిస్తోంది. రూ. 20,000 కంటే ఎక్కువ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 55 శాతం తగ్గింపు, 1 లక్ష కంటే ఎక్కువ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 60 శాతం తగ్గింపు కూడా అందిస్తోంది. చాలా ప్రముఖ బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై కస్టమర్‌లు అదనంగా 5 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.
మరిన్ని బిజినస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: