పెన్షన్‌దారులు, బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. ఇప్పుడు ఈ పనులు చేయడానికి మార్చి వరకు అవకాశం..

|

Jan 02, 2022 | 7:33 PM

Pensioners, Bank customers: కేవైసీ పెండింగ్‌లో ఉన్న బ్యాంకు ఖాతాదారులకు, పెన్షనర్లకు ప్రభుత్వం గొప్ప ఉపశమనం కల్పించింది. పెన్షన్ కోసం లైఫ్

పెన్షన్‌దారులు, బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. ఇప్పుడు ఈ పనులు చేయడానికి మార్చి వరకు అవకాశం..
Pension
Follow us on

Pensioners, Bank customers: కేవైసీ పెండింగ్‌లో ఉన్న బ్యాంకు ఖాతాదారులకు, పెన్షనర్లకు ప్రభుత్వం గొప్ప ఉపశమనం కల్పించింది. పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికేట్, బ్యాంక్ ఖాతా కోసం KYC అప్‌డేట్ కోసం గడువు పొడిగించారు. జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి చివరి వరకు అలాగే KYC అప్‌డేట్‌ కోసం మార్చి వరకు పెంచారు. దీని వల్ల ప్రజలకు దాదాపు 3 నెలల సమయం దొరికినట్లయింది. ప్రభుత్వ పెన్షనర్లకు జీవన్ ప్రమాణ్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28 వరకు నిర్ణయించారు. ఇదివరకు దీని చివరి తేదీ డిసెంబర్ 31, 2021గా ఉండేది. అయితే గడువుతేదిని పొడిగించడం ఇది రెండోసారి.

సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ 30 నాటికి పింఛనుదారులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని బ్యాంకు లేదా పెన్షన్ ఏజెన్సీకి ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి నవంబర్ 30కి బదులుగా డిసెంబర్ 31న నిర్ణయించారు. తరువాత డిసెంబర్ 31 తేదీని ఇటీవల ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించారు. గతంలో కూడా పెరుగుతున్న కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం లైఫ్ ప్రూఫ్ సమర్పించడానికి చివరి తేదీని పొడిగించింది. ఈసారి మళ్లీ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ముప్పు కనిపిస్తోంది. వృద్ధులు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి బ్యాంకు లేదా పెన్షన్ ఏజెన్సీకి వెళ్లాలి. ఇది వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే చివరి తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు.

KYC అప్‌డేట్
KYC అప్‌డేట్‌కు సంబంధించి ఖాతాదారులకు కొంచెం ఉపశమనం దొరికింది. రిజర్వ్‌ బ్యాంక్ KYC అప్‌డేట్ కోసం చివరి తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించింది. Omicron వేరియంట్ వేగాన్ని దృష్టిలో ఉంచుకుని KYC అప్‌డేట్ కోసం చివరి తేదీ పొడిగించారు. KYCని బ్యాంక్ ఖాతా వివరాలలో అప్‌డేట్ చేయాలి. కరోనా మహమ్మారి కారణంగా KYC అప్‌డేషన్‌కు ఇప్పటికే మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు ఈ పని మార్చి 31 వరకు చేయవచ్చు. మీ KYC పెండింగ్‌లో ఉంటే మీరు దానిని మార్చి 31 నాటికి పూర్తి చేయవచ్చు. ఈ తేదీలోపు KYC చేయాల్సి ఉంటుంది లేకుంటే బ్యాంకింగ్ లావాదేవీలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.

Super Foods: చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి 10 సూపర్ ఫుడ్స్‌.. అవేంటంటే..?

బూస్టర్‌ డోస్‌ గురించి శుభవార్త.. ఒమిక్రాన్‌పై 88% ప్రభావం.. UK అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..

Air Travel: విమాన ప్రయాణం ఖరీదు.. జెట్‌ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి.. లీటర్‌కి ఎంత పెరిగిందంటే..?