Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. జనవరి 26 నుంచి బ్యాంకులకు వరుస సెలవులు

|

Jan 19, 2023 | 1:17 PM

చాలా మందికి ప్రతి రోజు బ్యాంకు లావాదేవీలు ఉంటాయి. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి వారు బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. నెలాఖరులో బ్యాంకుల సమ్మె..

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. జనవరి 26 నుంచి బ్యాంకులకు వరుస సెలవులు
Bank Holidays
Follow us on

చాలా మందికి ప్రతి రోజు బ్యాంకు లావాదేవీలు ఉంటాయి. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి వారు బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. నెలాఖరులో బ్యాంకుల సమ్మె కారణంగా నాలుగు రోజుల పాటు బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియగదారులకు ఈ విషయాలను తెలుసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులను నివారించేందుకు ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. యాజమాన్యం హామీ ఇచ్చినా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లపై సానుకూల చర్యలు తీసుకోనందుకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) జనవరి 30-31 తేదీల్లో అఖిల భారత బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు. అయితే బ్యాంకు ఉద్యోగుల ఆరు అంశాల డిమాండ్లపై ఈ సమ్మె జరగనుంది. జనవరి 26 నుంచి 31 మధ్య, బ్యాంకులు జనవరి 27న కేవలం ఒక రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. బ్యాంకు ఖాతాదారులు తమ ముఖ్యమైన పనిని జనవరి చివరి వారంలోపు పూర్తి చేయాలి. లేకుంటే వారు వరుసగా బ్యాంకులు మూసి ఉన్నందున ఇబ్బందులు ఎదుర్కొంటారు.

26 నుంచి 31 వరకు బ్యాంకులు మూత

కాగా, జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు, 27న ఓపెన్‌ ఉంటాయి. 28న నాలుగో శనివారం, తర్వాత 29న ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇక జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకుల సమ్మె ఉంది. 27వ తేదీ తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వాణిజ్య బ్యాంకుల్లో పనిచేస్తున్న మొత్తం తొమ్మిది మంది అధికారులు ఉద్యోగుల సంఘం సంయుక్త ఫోరమ్ (యుఎఫ్‌బియు) పిలుపు మేరకు స్టేట్ బ్యాంక్‌తో పాటు అన్ని ఇతర బ్యాంకర్లు సమ్మెలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డీఎన్ త్రివేది మాట్లాడుతూ.. ఐదు రోజుల బ్యాంకింగ్, పెన్షన్ అప్‌డేషన్, ఎన్‌పీఎస్‌కు బదులుగా పాత పెన్షన్‌ను అమలు చేయడం, వేతన సవరణ, అన్ని కేడర్‌లలో తగిన రిక్రూట్‌మెంట్ వంటి డిమాండ్‌లు జరగాలని, తద్వారా మెరుగైన సేవలు అందుబాటులోకి రావాలన్నారు. అందుకే ఈ సమ్మె చేపట్టినట్లు వారు తెలిపారు. అయితే డిమాండ్లపై గురువారం ముంబైలో జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి