IT రిటర్న్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? ఎందుకు ఆలస్యమైంది..? ఎప్పుడు రావొచ్చు అంటే..?

2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి కోట్లాది ఐటీ రీఫండ్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. క్లెయిమ్‌ల పరిశీలన, తప్పుడు తగ్గింపుల వల్ల ఈ ఆలస్యం జరుగుతోందని సీబీడీటీ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లన్నీ డిసెంబర్ 2025 నాటికి అమలు చేసే అవకాశం ఉందని సీబీడీటీ ఛైర్మన్ రవి అగర్వాల్ ధృవీకరించారు.

IT రిటర్న్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? ఎందుకు ఆలస్యమైంది..? ఎప్పుడు రావొచ్చు అంటే..?
It Returns

Updated on: Nov 20, 2025 | 10:19 PM

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) పన్ను చెల్లింపుదారులకు దాఖలు గడువు (సెప్టెంబర్ 16) ఎప్పుడో ముగిసిపోయింది. దాదాపు రెండు నెలలకు పైగా గడిచినా చాలా మంది​కి 2025–26 అసెస్‌మెంట్ ఇయర్ ఐటీ రిటర్న్స్‌ ఇంకా అందలేదు. సెప్టెంబర్ 23 నాటికి 7.57 కోట్లకు పైగా రిటర్న్‌లు దాఖలు అయినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. అయినప్పటికీ చాలా మంది పన్ను చెల్లింపుదారులకు వాపసు పెండింగ్‌లో ఉంది.

లేట్‌ ఎందుకు..?

వ్యవస్థ గుర్తించిన కొన్ని వాపసు క్లెయిమ్‌లను శాఖ పరిశీలిస్తోందని సమాచారం. వీటిలో అసాధారణమైన లేదా తప్పు తగ్గింపు క్లెయిమ్‌ల కారణంగా అధిక విలువ లేదా రెడ్-ఫ్లాగ్డ్ గా గుర్తించబడిన రిటర్న్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. తప్పుడు రీఫండ్‌లను నిరోధించడానికి ఈ కేసులను శాఖ విశ్లేషిస్తోందని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ఏదైనా మర్చిపోయి ఉంటే సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయమని మేము వారికి లేఖ రాశాం అని కూడా వారు వెల్లడించారు.

CBDT చైర్మన్ రవి అగర్వాల్ ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లను డిసెంబర్ 2025 నాటికి అమలు చేసే అవకాశం ఉందని ధృవీకరించారు. వ్యవస్థ గుర్తించిన రీఫండ్ క్లెయిమ్‌లను ప్రస్తుతం శాఖ వివరణాత్మక సమీక్ష చేస్తోందని ఆయన అన్నారు. ఈ కేసుల్లో చాలా వరకు అధిక విలువ గల క్లెయిమ్‌లు లేదా తప్పుగా కనిపించే తగ్గింపులు ఉంటాయి, ఇది మొత్తం ప్రక్రియను స్లో చేసిందని తెలిపారు.

ఈ ఏడాది రీఫండ్ జారీలు బాగా తగ్గాయి. నవంబర్ 10 వరకు అప్డేట్‌ అయిన అధికారిక డేటా ప్రకారం.. ఏప్రిల్ 1, నవంబర్ 10 మధ్య మొత్తం రీఫండ్‌లు దాదాపు 18 శాతం తగ్గి రూ.2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రీఫండ్ క్లెయిమ్‌ల సంఖ్య తగ్గడం, TDS రేట్లు ముందుగానే రేషనలైజేషన్‌ వల్ల ఈ తగ్గుదల జరిగిందని అగర్వాల్ అన్నారు. ఇది మొత్తం మీద రీఫండ్ మొత్తాలను తగ్గించడానికి దారితీసింది. వీలైనంత త్వరలోనే అందరికీ రిటర్న్స్‌ వచ్చేలా చేస్తామని అన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us