AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI: ఫోన్‌పే, గూగుల్‌ పే ఎక్కువగా వాడుతున్నారా.? నోటీసులు వస్తాయి జాగ్రత్తా..

దేశంలో ప్రస్తుతం యూపీఐ సేవలు బాగా విస్తరించాయి. ప్రతీ చిన్న పనికి యూపీఐ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే పరిమితికి మించి యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ చేస్తే ఐటీ శాఖ నోటీసులు పంపించే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

UPI: ఫోన్‌పే, గూగుల్‌ పే ఎక్కువగా వాడుతున్నారా.? నోటీసులు వస్తాయి జాగ్రత్తా..
UPI
Narender Vaitla
|

Updated on: Nov 16, 2024 | 7:19 AM

Share

దేశంలో రోజురోజుకీ డిజిటల్‌ పేమెంట్స్ హవా పెరుగుతోంది. బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేకుండా స్మార్ట్‌ ఫోన్‌తోనే పని కానిచ్చేస్తున్నారు. ఒకప్పుడు వేరే వారి ఖాతాలో డబ్బులు వేయాలంటే బ్యాంకుకు వెళ్లి లైన్‌లో నిలబడి, వోచర్‌ నింపడం ఇలా పెద్ద కథ ఉండేది. కానీ ప్రస్తుతం అంతా మారిపోయింది. సెకనులో డబ్బులు పంపించుకునే రోజులు వచ్చేశాయి.

డిజిటల్ పేమెంట్స్‌లో అత్యధికం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ఇలా రకరకాల యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. యూపీఐ యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగించం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేసే వారిపై ఆదాయపు పన్ను విభాగం నిఘా పెడుతోంది.

బ్యాంక్‌ అకౌంట్‌లో పరిమితికి మించి నగదు జమ కావడం, ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసుకున్న ఆదాయపు పన్ను దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఇలాంటి వారికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు పంపించే అవకాశం ఉంది. దీంతో పన్నులు, పెనాల్టీలు చెల్లించాలని అధికారులు నేరుగా ఇంటికి నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

రోజువారీ లావాదేవీలపై నిఘా పెట్టేందుకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్‌ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా సేవింగ్స్‌ అకౌంట్‌లో ఒక ఏడాది రూ. 10 లక్షల లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్‌ దాటితే వెంటనే వివరాలు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగానికి వెళ్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ కింద బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పరిమితి ఉంటుంది. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో సేవింగ్స్ ఖాతాలో జమ అయిన డబ్బుల వివరాలు సరిపోలకపోతే మీకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్