IT Companies: ఐటీ కంపెనీల కొత్త వ్యూహం.. డిసెంబర్ నాటికి అమలుకు కసరత్తు

|

Aug 04, 2021 | 12:51 PM

గత ఏడాది మార్చి నుంచి వర్క్ ఫ్రం హోం బాట పట్టిన ఐటీ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అందుకు అనుగుణంగా..

IT Companies: ఐటీ కంపెనీల కొత్త వ్యూహం.. డిసెంబర్ నాటికి అమలుకు కసరత్తు
It Employees
Follow us on

గత ఏడాది మార్చి నుంచి వర్క్ ఫ్రం హోం బాట పట్టిన ఐటీ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఇప్పటికే 5 శాతం ఉద్యోగులతో పనిచేస్తున్న సంస్థలు డిసెంబర్ నాటికి 50 శాతం ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన ఫ్యూచర్ వర్క్ మోడల్స్ సర్వేలో తేలింది. బడా సంస్థలు ఇప్పటికైతే 5 శాతం ఉద్యోగులతో నడుస్తుంటే 500లోపు సిబ్బంది ఉన్న సంస్థలు 20 శాతం మందితో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే విషయమై కొన్ని సంస్థలు తమ ప్రణాళికలను సర్వేలో వెల్లడించాయి. డిసెంబర్ నాటికి వర్క్ ఫ్రం ఆఫీసును ప్రారంభించేందుకు 33 శాతం సంస్థలు చర్యలు తీసుకుంటుంటే 41 శాతం సంస్థలు వచ్చే ఏడాది తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలి భావిస్తున్నట్టు తేలింది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండడం వల్ల ఉత్పాదకత 22 శాతం తగ్గిందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇలా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే విషయమై సొంత ప్రణాళిక వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.