UPI: యూపీఐ, క్రెడిట్‌ కార్డు లింక్‌ సేఫేనా.? ఎలా లింక్‌ చేసుకోవాలంటే..

|

Nov 05, 2023 | 11:23 AM

దీంతో చాలా మంది యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. చిన్న టీ కొట్టు నుంచి నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు యూపీఐ సేవలను అంగీకరిస్తున్నారు. దీంతో డెబిట్ కార్డుల వినియోగం తగ్గింది. ఇక యూపీఐ సేవలను మరింత విస్తరించే నేపథ్యంలో క్రెడిట్‌ కార్డును కూడా యూపీఐ యాప్‌కి లింక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశంతో క్రెడిట్‌ కార్డ్‌ ద్వారానే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇంతకీ యూపీఐ యాప్‌ను...

UPI: యూపీఐ, క్రెడిట్‌ కార్డు లింక్‌ సేఫేనా.? ఎలా లింక్‌ చేసుకోవాలంటే..
Upi Credit Card
Follow us on

దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ ఓ రేంజ్‌లో విస్తరించాయి. నగదు రహిత లావాదేవీలకు ప్రజలకు అలవాటు పడ్డారు. ఒకప్పుడు కేవలం కార్డుల ద్వారానే నగదురహిత లావాదేవీలు జరిగేవి. కానీ ఎప్పుడైతే యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, క్షణాల్లో పేమెంట్ చేసే అవకాశం లభించింది.

దీంతో చాలా మంది యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. చిన్న టీ కొట్టు నుంచి నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకు యూపీఐ సేవలను అంగీకరిస్తున్నారు. దీంతో డెబిట్ కార్డుల వినియోగం తగ్గింది. ఇక యూపీఐ సేవలను మరింత విస్తరించే నేపథ్యంలో క్రెడిట్‌ కార్డును కూడా యూపీఐ యాప్‌కి లింక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశంతో క్రెడిట్‌ కార్డ్‌ ద్వారానే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇంతకీ యూపీఐ యాప్‌ను క్రెడిట్ కార్డుతో లింక్‌ చేయడం సేఫేనా.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఈ ఫీచర్‌ యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ బ్యాంకులకు చెందిన రూపే క్రెడిట్ కార్డుదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గతేడాది తీసుకొచ్చిన ఈ ఫీచర్‌కు ఆదరణ భారీగా పెరుగుతోంది. క్రెడిట్ కార్డును యూపీఐ యాప్‌తో లింక్‌ చేయడం పూర్తిగా సేఫ్‌. దీనివల్ల ఎలాంటి నష్టం జరగదు. సింపుల్‌గా బార్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా క్రెడిట్ కార్డు నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు. ఇంతకీ క్రెడిట్‌ కార్డును, యూపీఐతో ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. భీమ్‌ యాప్‌లో క్రెడిట్ కార్డును ఎలా లింక్‌ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందు కోసం ముందుగా మొబైల్ భీమ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం లింక్డ్‌ బ్యాంక్‌ ఖాతాను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం ‘అకౌంట్‌ లింక్‌’ విభాగంలోకి వెళ్లి.. ‘+’ సింబల్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే స్క్రీన్‌పై ‘బ్యాంక్‌ అకౌంట్‌’, ‘క్రెడిట్ కార్డ్‌’ అనే రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఇప్పుడు ‘క్రెడిట్‌ కార్డ్‌’ను ఎంచుకోవాలి. దీంతో మీ మొబైల్ నెంబర్‌కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ వివరాలను చూపిస్తుంది. తర్వాత క్రెడిట్ కార్డు చివరి ఆరు అంకెలు, వ్యాలిడిటీ తేదీని ఎంటర్ చేయాలి. అనంతరం రిజిస్టర్ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చివరిగా యూపీఐ పిన్‌ను క్రియేట్ చేసుకుంటే రిజిష్ట్రేషన్‌ పూర్తి అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..