గర్భధారణ సమయంలో నాన్ వెజ్ తినకూడదా? తల్లి పాల ద్వారానే శిశు మరణాలు.. తాజా అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు

|

Jan 30, 2023 | 8:50 PM

ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదాంట్లో కల్తీ జరుగుతోంది. కూరగాయాల నుంచి వివిధ రకాల పదార్థాలలో కల్తీ జరుగుతోంది. ముఖ్యంగా రైతులు పండించే కూరగాల్లో కూడా వివిధ రకాల పురుగు ముందులు స్ప్రె చేయడం వల్ల మనం..

గర్భధారణ సమయంలో నాన్ వెజ్ తినకూడదా? తల్లి పాల ద్వారానే శిశు మరణాలు.. తాజా అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు
Breast Milk
Follow us on

ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదాంట్లో కల్తీ జరుగుతోంది. కూరగాయాల నుంచి వివిధ రకాల పదార్థాలలో కల్తీ జరుగుతోంది. ముఖ్యంగా రైతులు పండించే కూరగాల్లో కూడా వివిధ రకాల పురుగు ముందులు స్ప్రె చేయడం వల్ల మనం తిన్న తర్వాత కూడా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ రోజుల్లో మంచి పోషకాలున్న ఆహారం దొరకడం లేదు. అలాగే మాంసహాలలో కూడా కల్తీ జరుగుతోంది. మేకలు, కోళ్లకు త్వరగా ఎదిగేందుకు వివిధ రసాయనాల మందులు ఇవ్వడం వల్ల కూడా వాటిలో కూడా కల్తీ జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో గత 10 రోజుల్లో సుమారు 111 మంది నవజాత శిశువులు మరణించారు. ఈ శిశువుల మరణానికి కారణం గర్భిణీ స్త్రీల పాల వల్లనేనని చెబుతున్నారు వైద్యులు. లక్నోలోని క్వీన్ మేరీ హాస్పిటల్ అధ్యయనంలో, మహరాజ్‌గంజ్‌లో ఈ మరణాలకు మహిళల పాలలో కనిపించే పురుగుమందులే కారణమని పేర్కొంది. అయితే తల్లి పాలలో పురుగు మందులు ఎలా వచ్చాయని అనుకుంటే పొరపాటే. ఎందుకుంటే నాన్‌వేజ్‌, పండించే కూరగాలు పురుగు మందులతో పండిస్తుండటంతో ఆ ప్రభావం తల్లి పాలపై పడుతోంది. ఇప్పుడు తల్లి పాలలో పురుగుమందుల ప్రభావం ఎలా పడిందనే దానిపై వైద్యులు పరిశోధన నిర్వహించారు.

ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనడానికి ఆసుపత్రి కొంతమంది గర్భిణీ స్త్రీలను పరీక్షించింది. ఈ అధ్యయనంలో 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణీ స్త్రీలను చేర్చారు. ఈ పరిశోధనను ప్రొఫెసర్ సుజాతా దేవ్, డాక్టర్ నైనా ద్వివేది, డాక్టర్ అబ్బాస్ అలీ మెహందీ చేశారు. ఈ అధ్యయనం ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ జనరల్‌లో ప్రచురించబడింది. ఈ పరిశోధనలో మాంసాహార మహిళల కంటే శాఖాహారం తీసుకునే మహిళల పాలలో తక్కువ పురుగుమందులను గుర్తించారు. మాంసాహారాలు, కూరగాయలలోనూ ఈ పురుగు మందుల ప్రభావం కనిపించింది.

మాంసాహారానికి దూరంగా ఉండే మహిళల తల్లి పాలలో తక్కువ పురుగు మందుల ప్రభావం ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. పాలలో పురుగుమందులు రావడానికి రసాయనిక వ్యవసాయమే కారణమని పరిశోధనలో తేలింది. వాస్తవానికి పచ్చి కూరగాయలు లేదా అన్ని పంటలను పండించడానికి వివిధ రకాల పురుగుమందులు, రసాయనాలను ఉపయోగిస్తారు. జంతువులకు సప్లిమెంట్లు, రసాయనాల ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. దీని కారణంగా మాంసాహారం తీసుకోని మహిళల తల్లి పాల ద్వారా కూడా పిల్లలకు ఎఫెక్ట్‌ అవుతుందని వైద్యులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మాంసాహారం తీసుకోని మహిళల పాలలో ఉండే పురుగుమందులు శాఖాహార మహిళల కంటే మూడు రెట్లు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. రసాయనిక మందుల వాడకం ప్రభావం తల్లి పాల ద్వారా పిల్లలపై పడుతోందని పరిశోధనలో తేలింది. ఈ పురుగులు మందులు స్ప్రెలు వంటివి నవజాత శిశువులకు తీవ్రమైన హాని కలిగిస్తాయని, ఫలితంగా వారి మరణానికి దారితీసింది. శిశు మరణాలు పెరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సిడిఓ) అధ్యక్షతన 3 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం..