
Irctc
వేసవిలో చల్లటి ప్రదేశానికిలో లాంగ్ ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా.? ఈ సీజన్‌లో కశ్మీర్ అందాలు చూడతరమా.. శ్రీనగర్ అందాలు.. గుల్‌మార్గ్ మంచుకొండల్లో రోప్‌వే ప్రయాణం.. ఇలా ఒకటేమిటి.. అక్కడ చూసి తరించేందుకు ఎన్నో ఉన్నాయి. ఇక ఇవన్నీ మీరు చూసేందుకు విమాన ప్రయాణం అంతే! కచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఇలాంటి ప్యాకేజీ అందిస్తోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(ఐఆర్‌సీటీసీ).
మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్ పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. మే 19 నుంచి జూన్ 30 వరకు ఈ ట్రిప్‌కి టికెట్ బుక్ చేసుకోవచ్చు. 5 రాత్రుళ్లు, 6 పగళ్లు కొనసాగే ఈ ట్రిప్ ప్రతీ శుక్రవారం(మే 19, జూన్ 2 మినహా) హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మే 19, 26 తేదీలకు సంబంధించిన టికెట్ బుకింగ్‌లు పూర్తి కాగా.. జూన్ 9, 16, 23, 30 తేదీల్లో తక్కువ సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
విమాన ప్రయాణం ఇలా..
తొలి రోజు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు విమానం బయల్దేరి.. సాయంత్రం 4.40 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఇక ఆరో రోజు శ్రీనగర్ నుంచి సాయంత్రం 5.10 గంటలకు విమానం బయల్దేరి.. రాత్రి 8.05 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ఈ ట్రిప్‌కి తప్పనిసరిగా కావాల్సినవి..
- సీనియర్ సిటిజన్లు ఈ టూర్‌కు టికెట్ బుక్ చేసుకునే ముందు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులు లేదా సహాయకులను తోడుగా తీసుకెళ్ళాలి.
- సమయానికి రెండు గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి.
- ప్రయాణ పత్రాలను చెక్ చేసే సమయంలో రెండేళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు బర్త్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా చూపించాలి.
ప్యాకేజీలో ఏమేమి ఉంటాయంటే..
- ఆరు రోజులు టిఫిన్, డిన్నర్ ఫ్రీగా ఇస్తారు
- త్రీ స్టార్ హోటల్‌లో బస
- విమాన ప్రయాణంలో తీసుకున్న ఆహారానికి కూడా ప్రయాణీకులే చూసుకోవాలి
- మధ్యాహ్న భోజనానికి ప్రయాణీకులే ఖర్చు భరించాలి
- పర్యాటక ప్రదేశాల్లో ప్రవేశ ఛార్జీలు భరించడంతో పాటు, గైడ్‌ను సైతం యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.
ప్యాకేజీ ఛార్జీల వివరాలు..
- సింగిల్ షేరింగ్‌కు రూ. 42,895.
- ట్విన్ షేరింగ్‌కు రూ. 38, 200.
- త్రీ షేరింగ్‌కు రూ. 36, 845
- 5-11 ఏళ్ల వారికి బెడ్ కావాలంటే రూ. 28, 430, బెడ్ లేకుండా రూ. 25, 750.
- 2-4 ఏళ్ల చిన్నారులకు రూ. 25, 750.
- యాత్రకు 21 రోజుల ముందు టికెట్ రద్దు చేసుకుంటే.. చెల్లించిన మొత్తంలో 70 శాతం, 21-15 రోజులకు 45 శాతం, 14-8 రోజులకు 20 శాతం డబ్బు రిటర్న్ వస్తుంది. 8 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే డబ్బు రాదు.