IRCTC: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా కశ్మీర్‌ టూర్‌.. ఐఆర్‌సీటీసీ అందిస్తోన్న స్పెషల్‌ ప్యాక్‌పై ఓ లుక్కేయండి.

|

Apr 10, 2023 | 6:18 PM

అసలే ఎండలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు సెలవులు కూడా రానున్నాయి. మరి ఈ హాట్‌ సమ్మర్‌ను కూల్‌ కూల్‌గా ఎంజాయ్‌ చేస్తే భలే ఉంటుంది కదూ! ఇండియాలో ఉండే కూల్ ప్లేసెస్‌లో కశ్మీర్‌ మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే...

IRCTC: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా కశ్మీర్‌ టూర్‌.. ఐఆర్‌సీటీసీ అందిస్తోన్న స్పెషల్‌ ప్యాక్‌పై ఓ లుక్కేయండి.
Irctc
Follow us on

అసలే ఎండలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు సెలవులు కూడా రానున్నాయి. మరి ఈ హాట్‌ సమ్మర్‌ను కూల్‌ కూల్‌గా ఎంజాయ్‌ చేస్తే భలే ఉంటుంది కదూ! ఇండియాలో ఉండే కూల్ ప్లేసెస్‌లో కశ్మీర్‌ మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కశ్మీర్‌ టూర్‌ వెళ్లడం అంత సులభమైన విషయం కాదు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే రైళ్లు మారడం, స్థానికంగా హోటల్స్‌ కోసం వెతకడం ఇబ్బందితో కూడుకున్న విషయం. ఇలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో కశ్మీర్‌ టూర్‌ ప్లాన్‌ అందిస్తోంది.

హైదరాబాద్‌ మీదుగా మే 11వ తేదీన సేవలు ప్రారంభిస్తున్నట్లు సౌత్‌ స్టార్‌ రైలు ప్రతినిధులు తెలిపారు. భారతీయ రైల్వే ప్రారంభించిన భారత్ గౌరవ్ పథకంలో భాగంగా ‘సౌత్ స్టార్’ నూతన రైల్వే సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో సౌత్ స్టార్ రైల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విఘ్నేశ్ మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు. వేసవి విడిది నేపథ్యంలో థీమ్ టూరిస్ట్ ప్యాకేజీలో భాగంగా కశ్మీర్‌కు ప్రత్యేక రైల్‌ను ప్రారభించనున్నారు. ఈ రైలు కోయంబత్తూర్ నుంచి ప్రారంభమై హైదరాబాద్, వరంగల్, ధర్మపురి, విజయవాడ, ఈరోడ్, సేలం, ఎలహంక, పెరంబదూర్ మీదుగా వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ టూర్‌లో భాగంగా జమ్ముకశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాలను సందర్శించవచ్చు. 12 రోజుల వ్యవధితో టూర్‌ ఉంటుంది. ప్రయాణ బీమా, సైట్ సీయింగ్, భోజన వసతి అందిస్తారు. జూలై 2, 6, 10, 15, 18, 22, 24, 26, 29, 30 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేయొచ్చు. బుకింగ్‌తో పాటు తదితన సమాచారం కోసం 7876101010 నెంబర్ లేదా వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..