IRCTC : రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పుడు మీరు కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమాను పొందవచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ చాలా మందికి తెలియదు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇందులో బీమా ప్రీమియం ప్రయాణికుడికి 45 పైసలుగా నిర్ణయించింది. రైలు ప్రయాణం చేసేవారికి ఇది తప్పనిసరి. ఈ పథకం భారతీయ పౌరులకు మాత్రమే, ఇ-టికెట్ల ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులు మాత్రమే పొందుతారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ బీమా IRCTC ద్వారా ఇ-టికెట్లను బుక్ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే. అయితే విదేశీ పౌరులు, ఏజెంట్లు లేదా ఇతర ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని పొందలేరు. సీటు లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకునే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఈ బీమాలో చేర్చలేదు. కానీ 5-11 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ బుక్ చేసినట్లయితే ఈ బీమా అందుబాటులో ఉంటుంది.
బీమా పొందడం ఎలా?
రైల్వే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు SMS, ఇమెయిల్ ద్వారా ప్రయాణికుడికి బీమా సమాచారం అందుతుంది. ప్రయాణికులు వారి టిక్కెట్ బుకింగ్‌లో పాలసీ నంబర్, ఇతర సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నామినీ వివరాలను పూరించాల్సి ఉంటుంది. నామినేషన్ సమాచారం నింపకపోతే క్లెయిమ్ విషయంలో చట్టపరమైన వారసులకు చెల్లింపు ఉంటుంది. ఈ బీమా పాలసీ ధృవీకరించిన, RAC (Reservation Against Cancellation) టిక్కెట్ హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణ సమయంలో ప్రమాదాలు లేదా అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు ప్రయాణికులను రక్షించేందుకు ఈ పాలసీని రూపొందించారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి