IRCTC: ఒకే టూర్‌లో అయోధ్య, కాశీ, పూరీ జగన్నాథ ఆలయ దర్శనం.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అద్బుత అవకాశం.. తక్కువ ధరలోనే..

అయోధ్య రామాలయం, వారణాసి, పూరీ జగన్నాథ్ దేవాలయం లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకేసారి దర్శించుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో తక్కువ ధరలో అన్ని ప్రదేశాలను ఒకే టూర్‌లో దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ వివరాలు ఇప్పుడు చూద్దాం.

IRCTC: ఒకే టూర్‌లో అయోధ్య, కాశీ, పూరీ జగన్నాథ ఆలయ దర్శనం.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అద్బుత అవకాశం.. తక్కువ ధరలోనే..
Irctc

Updated on: Aug 29, 2026 | 5:00 PM

అయోధ్య రామాలయం, కాశీ, కోణార్క్ దేవాలయం చూడాలనుకుంటున్నారా..? అయితే తెలుగు ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. తక్కువ ఖర్చుతో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను ఒకే టూర్‌లో సందర్శించవచ్చు. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ అద్బుత ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్, విజయవాడ మీదుగా భారత్ గౌరవ్ ప్రత్యేక టూరిస్ట్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం పది రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య రామాలయం, కాశీ విశ్వనాథ దేవాలయం, పూరీ జగన్నాధ టెంపుల్, కోణార్క్ సూర్య దేవాలయం వంటి వాటిని ఒకే టూర్‌లో దర్శించుకోవచ్చు. అలాగే గంగాహారతి, సరయూ నదీ హారతి, త్రివేణి సంగమం వంటి ప్రాంతాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ టూర్ వివరాలు, ప్యాకేజీ డీటైల్స్ ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 24 నుంచి టూర్ స్టార్ట్

అక్టోబర్ 24వ తేదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభమవుతుంది. ఈ ట్రైన్ విజయవాడ మీదుగా గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకొట, తుణి మీదుగా వెళుతుంది. మొత్తం 10 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ టెంపుల్, కోణార్క్ సూర్య దేవాలయం, బైధ్యనాథ్ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఆ తర్వాత వారణాసిలోని కాశీ విశ్వనాథ టెంపుల్, విశాలాక్ష్మి, అన్నపూర్ణ దేవాలయం దర్శనం ఉంటుంది. అనంతరం అయోధ్య రామాలయం, హనుమాన్ ఆలయం, త్రివేణి సంగమం, గంగాహారతి, సరయూ నదీ హారతి వంటి సందర్శనలు ఉంటాయి. వీటి సందర్శన అనంతరం నవంబర్ 2న తిరుగు ప్రయాణం ఉంటుంది.

ప్యాకేజీ వివరాలు

ధరల విషయానికొస్తే.. స్లీపర్ క్లాస్ ఒక్కొ టికెట్ ధర రూ.17 వేలుగా రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇక థర్డ్ ఏసీ ఒక్కొ టికెట్ రూ.26,400గా ఉండగా.. సెకండ్ ఏసీ రూ.34,400గా ఉంది. టీ, టిఫిన్, భోజనం, వసతి, రవాణా, ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. ఇతర వివరాల కోసం 9281030714 నెంబర్‌ను సంప్రదించాలని రైల్వే అధికారులు తెలిపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లోకి వెళ్లి టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే భారత్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వేశాఖ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లల్లో టికెట్లపై 33 శాతం రాయితీ సౌకర్యం కూడా కల్పిస్తోంది. దీంతో తక్కువ ధరలో ఎక్కువ పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునేవారికి ఈ రైళ్లు బాగా ఉపయోగపడుతున్నాయి. రైల్వేశాఖ ఎప్పటినుంచో ఈ ట్రైన్లను నడుపుతోంది. ఈ ట్రైన్ల ద్వారా లక్షలాది మంది దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. దేశంలో టూరిజంను ప్రోత్సహించడంలో ఈ రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us