ఆపిల్ మెగా ఈవెంట్ తేదీని ప్రటించింది. సెప్టెంబర్ 9న ‘ఇట్స్ గ్లో టైమ్’ ఈవెంట్ జరగబోతోంది. ఈ సంవత్సరం దిగ్గజం టెక్ కంపెనీ ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను పరిచయం చేస్తుంది. అయితే ఈసారి ఈవెంట్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఐఫోన్ 16 ఇన్-బిల్ట్ AI, ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో వచ్చిన మొదటి ఆపిల్ డివైజ్. చివరిసారి WWDC 2024 సమయంలో కంపెనీ iOS 18ని పరిచయం చేసింది, ఇది AIతో రూపొందించబడింది.
ఐఫోన్ 15 సిరీస్‌తో పోలిస్తే, ఐఫోన్ 16 సిరీస్‌లో చాలా ప్రత్యేక ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మునుపటి లైనప్‌తో పోలిస్తే ఈసారి చాలా అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో iPhone 16 సిరీస్‌లో వస్తున్న 5 ప్రధాన అప్‌గ్రేడ్‌లు ఏమిటో తెలుసుకుందాం.
iPhone 16 బేస్ మోడల్‌లో మార్పులు జరగవచ్చని భావిస్తున్నారు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లలో వెనుక ప్యానెల్‌లో నిలువు వరుసతో డ్యూయల్ కెమెరాలతో కొత్త రూపాన్ని చూడవచ్చు. ఈ మోడల్‌లో సన్నని బెజెల్స్,పెద్ద స్క్రీన్ ఉండవచ్చు అని తెలుస్తోంది.
ఐఫోన్ 16 సిరీస్‌లో మెరుగైన A18 బయోనిక్ చిప్‌సెట్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే, కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. లీకైన సమాచారం ప్రకారం.. A18తో ఫోన్ పవర్ రెట్టింపు కానుంది. ఇది జరిగితే, ఐఫోన్ 16 సిరీస్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం గొప్ప ఎంపికగా మారుతుంది.
ఐఫోన్ కెమెరా ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే ఫోన్ 16తో దీన్ని మరింత మెరుగ్గా మార్చాలని యాపిల్ భావిస్తోంది. లీకైన వివరాల ప్రకారం, iPhone 16 ప్రో మోడల్‌లో 48-మెగాపిక్సెల్ ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌ను కనుగొనవచ్చు. అలాగే ఇది AI- పవర్డ్ ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఐఫోన్ 16లో యాక్షన్ బటన్ కూడా అందుబాటులో ఉండబోతోందని లీక్ నుండి వెల్లడైంది. ఈ బటన్ పరికరం వైపు మ్యూట్ టోగుల్ బార్‌ను భర్తీ చేస్తుంది. ఐఫోన్ 16 సిరీస్‌లో క్యాప్చర్ బటన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్యాప్చర్ బటన్ ల్యాండ్‌స్కేప్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
ఇప్పుడు AI రేసులో Apple కూడా వెనుకబడి లేదు. ఐఫోన్ 16 సిరీస్‌లో AI ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా, సిరి ఈ సిరీస్‌లో ChatGPTతో కనెక్ట్ చేయబడుతుంది.
ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్‌లో 5 స్టార్ సౌకర్యాలు.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి