Small Savings Schemes: చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టాలా? వద్దా?
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో దూరం జరుగుతోంది వినయ్ మాత్రమే కాదు... అతనిలాంటి మనస్తత్వం ఉన్న లక్షలాది మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. క్రమంగా వాటిలో పెట్టుబడులకు దూరం కావడం మొదలుపెట్టారు. GDP నిష్పత్తిలో చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు నిరంతరం తగ్గుముఖం పట్టడానికి ఇదే కారణం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో, చిన్న పొదుపు పథకాలలో..
నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు వినయ్. పన్నును ఆదా చేయడానికి ప్రతి సంవత్సరం PPFలో పెట్టుబడి పెడతాడు. కానీ ఇప్పుడు అతను ఈ పెట్టుబడి నుంచి నెమ్మదిగా పక్కకు జరగాలని కోరుకుంటున్నాడు. కొత్త పన్ను విధానంలో ఇటువంటి పెట్టుబడులపై పన్ను మినహాయింపు లేదు. మరోవైపు, దాదాపు 4 సంవత్సరాలుగా PPF పై ప్రభుత్వం వడ్డీని పెంచలేదు. 2020 జూన్ త్రైమాసికం నుండి PPF వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పూ లేదు. అయితే బ్యాంకులు FDపై ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. బంగారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు కూడా అధిక రాబడిని ఇస్తున్నాయి.
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో దూరం జరుగుతోంది వినయ్ మాత్రమే కాదు… అతనిలాంటి మనస్తత్వం ఉన్న లక్షలాది మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. క్రమంగా వాటిలో పెట్టుబడులకు దూరం కావడం మొదలుపెట్టారు. GDP నిష్పత్తిలో చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు నిరంతరం తగ్గుముఖం పట్టడానికి ఇదే కారణం.
2020-21 ఆర్థిక సంవత్సరంలో, చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి మొత్తం GDPలో 1.54 శాతానికి సమానం. ఇది 2021-22లో 1.42 శాతానికి తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 1.12 శాతానికి పరిమితమైంది. చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి తగ్గుతోంది. పైగా ప్రభుత్వమే ఈ డబ్బును వినియోగిస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు తగ్గుతున్నప్పటికీ వీటిపై పన్ను మినహాయింపు ఉండటంతో చాలా మంది ఇన్వెస్టర్లు అయోమయంలో పడ్డారు. వాటిని కొనసాగించాలా లేక పెట్టుబడి ఆప్షన్ల వైపు మళ్లాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. వాటిలో రాబడులు బాగానే ఉన్నా.. మనీ తీసుకునేటప్పుడు భారీగా పన్నులు చెల్లించాలి.
ఈ రకమైన ఇన్వెస్ట్ మెంట్స్ లో బంగారం, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లోని అన్ని పెట్టుబడులు ఉంటాయి. బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. ఆదా చేసేవారిపై ఆదాయపు పన్ను ప్రభావాన్ని ఆర్థిక మంత్రి తగ్గించాలని వినయ్ వంటి లక్షల మంది పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. ఇదే జరిగితే పొదుపు ప్రోత్సాహం పెరగడమే కాకుండా.. చిన్న పొదుపు పథకాల ద్వారా ప్రభుత్వానికి జమ అయ్యే మూలధనం కూడా పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి