FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీల జాతర… కొన్ని ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలతో నమ్మలేని లాభాలు

|

Mar 03, 2024 | 7:30 PM

ఎఫ్‌డీలను తక్కువ రిస్క్ పెట్టుబడులుగా పరిగణిస్తారు. అయితే వీటిల్లో ఉత్తమ ఎఫ్‌డీ రేట్లు అందించే బ్యాంకులు వివిధ కారకాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంబంధించిన నిర్దిష్ట కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలోని కొన్ని బ్యాంకులు పోటీ ఎఫ్‌డీ రేట్లను అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వంటి బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీల జాతర… కొన్ని ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలతో నమ్మలేని లాభాలు
Cash
Follow us on

స్థిరమైన రాబడితో పాటు మూలధన సంరక్షణను కోరుకునే పెట్టుబడిదారులకు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్‌గా మారాయి. ఎఫ్‌డీలను తక్కువ రిస్క్ పెట్టుబడులుగా పరిగణిస్తారు. అయితే వీటిల్లో ఉత్తమ ఎఫ్‌డీ రేట్లు అందించే బ్యాంకులు వివిధ కారకాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంబంధించిన నిర్దిష్ట కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలోని కొన్ని బ్యాంకులు పోటీ ఎఫ్‌డీ రేట్లను అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వంటి బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ప్రత్యేక వ్యవధితో డిపాజిట్ చేస్తే బ్యాంకులు మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచి వడ్డీ రేట్లు అందించే బ్యాంకుల గురించి ఓసారి తెలుసుకుందాం. 

ఆర్‌బీఎల్ బ్యాంక్ 

ఆర్‌బీఎల్ బ్యాంక్ 546 రోజుల నుంచి 24 నెలల వరకు (18 నెలల నుంచి 24 నెలల వరకు) డిపాజిట్లకు 8.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

డీసీబీ బ్యాంక్ 

డీసీబీ బ్యాంక్ 25 నెలల నుంచి 26 నెలల వరకు ఉండే డిపాజిట్లకు 8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇండస్ ఇండ్ బ్యాంక్ 

ఇండస్ ఇండ్ బ్యాంక్ వివిధ వ్యవధుల కోసం 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఒక సంవత్సరం నుంచి 1 సంవత్సరం 6 నెలల కంటే తక్కువ, 1 సంవత్సరం 6 నెలల నుండి 1 సంవత్సరం 7 నెలల కంటే తక్కువ, అలాగే 1 సంవత్సరం 7 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఈ వడ్డీ రేటు అమల్లో ఉంటుంది. 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 549 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే డిపాజిట్లకు 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

యస్ బ్యాంక్ 

యస్ బ్యాంక్  18 నెలల నుంచి 24 నెలల లోపు డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

పీఎన్‌బీ బ్యాంక్ 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 400 రోజుల పాటు ఉండే డిపాజిట్లకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా 

బ్యాంక్ ఆఫ్ బరోడా 2 సంవత్సరాల కంటే ఎక్కువతో పాటు 3 సంవత్సరాల వరకు డిపాజిట్లకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

ఎస్‌బీఐ 

ఎస్‌బీఐ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు ఉండే డిపాజిట్లకు 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 18 నెలల నుండి 21 నెలల లోపు డిపాజిట్లకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ 

ఐసీఐసీఐ బ్యాంక్ 15 నెలల నుంచి 18 నెలల లోపు డిపాజిట్లకు 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు డిపాజిట్లకు కూడా ఇదే వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. 

యాక్సిస్ బ్యాంక్ 

యాక్సిస్ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 18 నెలల కంటే తక్కువతో పాటు 17 నెలల కంటే ఎక్కువ ఉండే డిపాజిట్లపై 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ 

కోటక్ మహీంద్రా బ్యాంక్ 390 రోజుల (12 నెలల 24 రోజులు) డిపాజిట్‌లకు 7.40 శాతతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే 391 రోజుల నుంచి 23 నెలల కంటే తక్కువ వ్యవధిలో ఉండే డిపాజిట్లకు 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

పంజాబ్ & సింధ్ బ్యాంక్ 

పంజాబ్ & సింధ్ బ్యాంక్ 444 రోజుల పాటు ఉండే డిపాజిట్లకు 7.40% వడ్డీ రేటును అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి