Palm Oil: అంతర్జాతీయ కారణాల వల్ల వంటనూనె(Cooking Oil) ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారాయి. అక్కడ ధరలు పెరిగినప్పుడు మనదేశంలో కూడా పెంచుతున్నారు. కానీ ఇండోనేషియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పుడు మళ్లీ పామాయిల్ రేట్లు తగ్గాల్సి ఉంది. కానీ.. ఆ ప్రతిఫలం మన వరకు అందుతుందా లేదా అనే ఆందోళనలో దేశంలోని ప్రజలు ఉన్నారు.
అసలు విషయం ఏమిటంటే..
ఇప్పటికే ధరల భారంతో సతమతమౌతున్న దేశ ప్రజలకు ఒక వార్త ఇప్పుడు కొంత ఉపసమనాన్ని కలిగిస్తోంది. అదేంటంటే పాయాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా దేశం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించటమే ఇందుకు కారణం. దీని కారణంగా అత్యధికంగా పాయాయిల్ దిగుమతి చేసుకుంటున్న మన దేశానికి ఎక్కువ ఉపశమన లభించనుంది. దీని కారణంగా రానున్న కాలంలో వంటనూనెల ధరలు క్రమంగా తగ్గేందుకు మార్గం సుగమం అయింది. ఇండేనేషియా ఈ నెల 23 నుంచి పాయాయిల్ ఎగుమతులపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయనుంది. ఆ దేశంలోని వ్యాపారులు ఈ మేరకు అక్కడి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అక్కడి ప్రభుత్వం అనూహ్యంగా ఎగుమతులపై తీసుకున్న నిర్ణయం ద్వారా ఆయిల్ స్టాక్ పేరుకుపోయాయి. వీటిని క్లియర్ చేయకపోతే తాము మరింత నష్టాలను చవిచూడవలసి ఉంటుందని వారు ప్రభుత్వానికి వెల్లడించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా తన వద్ద ఉన్న 6 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని దాదాపు చేరుకోవటంతో నిషేధం ఎత్తివేయక తప్పలేదని తెలుస్తోంది.
దేశీయ అవసరాల కోసం ఇండోనేషియా మెుత్తం ఉత్పత్తిలో 35 శాతాన్ని మాత్రమే వినియోగిస్తోంది. దీని కారణంగా వంటనూనెల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆదారపడే భారత్ లాంటి దేశాలకు ఇవి సరఫరా చేస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 83 లక్షల టన్నుల పామాయిల్ దిగుమతి చేసుకుంటోంది. దిగుమతుల్లో 70 శాతాన్ని ఇండోనేషియా నుంచి మిగిలిన 30 శాతాన్ని మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..