Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ బలహీనతలే కారణమా..

గురువారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు అంతర్జాతీయ బలహీనతల నడుమ సెన్సెక్స్​ 826 పాయింట్లు నష్టపోయి 57,968కి పడిపోయింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 253 కోల్పోయి 17,282 వద్ద ట్రేడ్​ అవుతోంది...

Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ బలహీనతలే కారణమా..
Stocks

Updated on: Nov 26, 2021 | 9:41 AM

గురువారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు అంతర్జాతీయ బలహీనతల నడుమ సెన్సెక్స్​ 826 పాయింట్లు నష్టపోయి 57,968కి పడిపోయింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 253 కోల్పోయి 17,282 వద్ద ట్రేడ్​ అవుతోంది. సిప్ల, డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్‎జీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, కొటాక్ మహీంద్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెనెస్క్ 30లో డాక్టర్ రెడ్డీస్ తప్ప అన్ని కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగుచూసిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ (B.1.1.529)పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనితో పాటు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలు కొనసాగుతున్నాయి. థ్యాంక్స్‌ గివింగ్‌ సంబరాల నేపథ్యంలో గురువారం అమెరికా మార్కెట్లు పనిచేయలేదు. నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మన మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.

Read Also.. Petrol Diesel Price: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రో ధరలు.. తెలంగాణ, ఏపీల్లో మాత్రం ఇలా..