మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్ చివరి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2024న సమర్పించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బడ్జెట్ పూర్తి బడ్జెట్ కాదు. ఎందుకంటే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. భారతీయ చరిత్రలో, సాధారణ బడ్జెట్‌కు ఒక రోజు ముందు రైల్వే బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయం ఉంది. దీనిని 2017 లో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. మధ్యంతర బడ్జెట్‌లో కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే ఈసారి మధ్యంతర బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రైల్వేకు ప్రభుత్వం రూ.2.4 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇది భారతదేశపు మొదటి రైల్వే బడ్జెట్ కంటే అనేక వేల రెట్లు ఎక్కువ. స్వాతంత్య్రానంతరం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ గురించి తెలుసుకుందాం.
తొలి రైల్వే బడ్జెట్ ఎంత పెద్దది?
భారతీయ రైల్వే మొదటి బడ్జెట్ 1947-48లో సమర్పించారు. ఇది రూ. 183 కోట్లు. ఇప్పుడు వందేభారత్ రైలును సిద్ధం చేయడానికి దాదాపు రూ.115 కోట్లు ఖర్చవుతుంది. రెండు వందేభారత్‌ల ఖర్చు కలిపితే, మొత్తం రూ. 230 కోట్లు అవుతుంది, ఇది మొదటిసారిగా సమర్పించిన రైల్వే మొత్తం బడ్జెట్ కంటే రూ.47 కోట్లు ఎక్కువ. అంటే ఆ బడ్జెట్‌లో ఒక్క వందే భారత్ రైలు మాత్రమే సిద్ధం అవుతుంది. 1947 నవంబర్ 26న అప్పటి భారత రైల్వే, రవాణా శాఖ మంత్రి జాన్ మథాయ్ స్వతంత్ర భారతదేశానికి మొదటి రైల్వే బడ్జెట్‌ను సమర్పించారు. అతను మూడు నెలల తర్వాత 24 ఫిబ్రవరి 1948న రెండవ పూర్తి రైల్వే బడ్జెట్‌ను సమర్పించాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు.
జగ్జీవన్ రామ్ అత్యధికంగా ఏడుసార్లు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2023-24 సంవత్సరానికి రైల్వే బడ్జెట్ రూ.2.4 లక్షల కోట్లు. ఇది 2013-14 బడ్జెట్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ. ఈసారి పెరుగుదల కనిపించవచ్చు. 2016లో రైల్వే బడ్జెట్ పరిమాణం మొత్తం బడ్జెట్‌లో దాదాపు 15% అని చెప్పారు. అందుకే దీన్ని సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2017 ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో తొలి ఉమ్మడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ ఏడాది అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
పేపర్‌లెస్ బడ్జెట్
1955 సంవత్సరం వరకు బడ్జెట్‌ను ఆంగ్లంలో మాత్రమే సమర్పించేవారని, అయితే ఆ సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ఇంగ్లీషు, హిందీ భాషలలో ప్రవేశపెట్టడం ప్రారంభించించారు. 1999 వరకు, బడ్జెట్ ప్రసంగాన్ని ఫిబ్రవరి చివరి పనిదినం రోజున సాయంత్రం 5 గంటలకు సమర్పించారు. అయితే యశ్వంత్ సిన్హా 1999లో ఉదయం 11 గంటలకు సమర్పించారు. 2017లో బడ్జెట్‌లో రెండు ప్రధాన మార్పులు జరిగాయి. మొదటిది రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో విలీనం చేయడం, రెండవ ప్రధాన మార్పు నెల చివరి రోజు ఫిబ్రవరి 1వ తేదీన సమర్పించడం. ఇది మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను మొదటిసారిగా డిజిటల్‌గా సమర్పించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి