మొట్టమొదటి బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్‌ అప్డేట్‌..! వీడియో రిలీజ్‌ చేసిన కేంద్ర మంత్రి

భారతదేశ మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ (ముంబై-అహ్మదాబాద్) నిర్మాణంలో కీలక మైలురాయిని చేరుకుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ (OHE) మాస్ట్‌ల ఏర్పాటు వేగంగా జరుగుతోందని ప్రకటించారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవతో ఈ హై-స్పీడ్ రైలు వ్యవస్థ అభివృద్ధి అవుతోందని అన్నారు.

మొట్టమొదటి బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్‌ అప్డేట్‌..! వీడియో రిలీజ్‌ చేసిన కేంద్ర మంత్రి
Ashwini Vaishnaw

Updated on: Jan 20, 2026 | 7:53 AM

ఇప్పటికే వందే భారత్‌, వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లతో ఇండియన్‌ రైల్వేస్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మక బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌పై రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. భారత్‌లో మొట్టమొదటి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముంబై – అహ్మదాబాద్ మధ్య చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ (OHE) మాస్ట్‌ల ఏర్పాటు స్థిరమైన పురోగతి సాధిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అభివృద్ధి భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ రైలు వ్యవస్థకు విద్యుత్ ట్రాక్షన్‌ను ప్రారంభించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ కింద స్థిరమైన ఆన్-గ్రౌండ్ అమలును ప్రతిబింబిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన హై-స్పీడ్ రైలు సాంకేతికతను అవలంబిస్తూ దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. సురక్షితమైన, మృదువైన, సమర్థవంతమైన హై-స్పీడ్ రైలు కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి వయాడక్ట్ స్ట్రెచ్‌లతో సహా అలైన్‌మెంట్‌లోని కీలక విభాగాలలో OHE మాస్ట్‌ల సంస్థాపన జరుగుతోందని వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి జరుగుతున్న పనులు చూపించేలా ఒక వీడియోను కూడా అశ్విన్‌ వైష్ణవ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి