Electricity Train: ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?

|

Dec 23, 2024 | 2:19 PM

Indian Railways: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లో భారతదేశం ఒకటి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రవాణా సంస్థల్లో రైల్వే ఒకటి. అందుకే లక్షలాది మంది భారతీయులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి రైలు ప్రయాణంపై ఆధారపడుతున్నారు. టికెట్‌ ఛార్జీలు సైతం తక్కువగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకునేంత అనుకూలంగా ఉంటుంది.

Electricity Train: ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
Follow us on

Electricity Train: భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రతి ఒక్కరు రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు. సామాన్యులకు సైతం రైలు ప్రయాణం అందుబాటులో ఉంటుంది. గతంతో పోలిస్తే ఈ రైలులో పలు మార్పులు చేశారు. స్వాతంత్ర్యం తరువాత, భారతదేశం రైల్వే వ్యవస్థలో అనేక మార్పులకు గురైంది. వాటిలో ఒకటి ఎలక్ట్రిక్ ఇంజిన్. ఈ రోజుల్లో చాలా రైళ్లు కరెంటుతో నడుస్తున్నాయి. దీంతో రైలు వేగం కూడా పెరుగుతుంది. కానీ రైలుకు సరఫరా చేసే విద్యుత్ ఎప్పుడూ ఎందుకు నిలిపవేయరనే విషయం మీకు తెలుసా?

రైలుకు విద్యుత్‌ ఇలా వస్తుంది:

రైల్వే ప్రకారం.. ఎలక్ట్రిక్ రైళ్లకు 25 వేల వోల్టేజ్ (25 kV) అవసరం. ఈ కరెంట్ పాంటోగ్రాఫ్ ద్వారా ఇంజిన్‌కు చేరుకుంటుంది. ఇది ఇంజిన్ పైన అమర్చిన యంత్రం. పాంటోగ్రాఫ్ రైలు పైభాగానికి జోడించిన వైర్‌తో ఘర్షణ ద్వారా కదులుతుంది. ఈ వైర్ల ద్వారా రైలుకు విద్యుత్తు సరఫరా అవుతుంది. ఎలక్ట్రిక్ రైళ్లలో రెండు రకాల పాంటోగ్రాఫ్‌లను ఉపయోగిస్తారు. డబ్ల్యుబిఎల్ డబుల్ డెక్కర్ ప్యాసింజర్ కోసం ఉపయోగిస్తారు. సాధారణ రైళ్లలో హై స్పీడ్ పాంటోగ్రాఫ్‌లను ఉపయోగిస్తారు. పాంటోగ్రాఫ్ ద్వారా ఓవర్ హెడ్ వైర్ నుండి కరెంట్ సరఫరా అందుతుంది. ఇది 25KV (25,000 వోల్ట్లు) విద్యుత్ మోటారు ప్రధాన ట్రాన్స్‌ఫార్మర్‌కు కరెంట్‌ను అందిస్తుంది. ఇది మోటారును నడుపుతుంది.

ఈ వ్యవస్థ ఎలక్ట్రిక్ రైళ్లలో ఉపయోగిస్తారు

రైలు ఒక రైల్వే ట్రాక్ మీదుగా వెళ్ళినప్పుడు దానిపై ఒక భారం ఏర్పడుతుంది. మెటల్ ట్రాక్‌కు జోడించిన స్ప్రింగ్ కంప్రెస్ చేయబడుతుంది. దీని కారణంగా రాక్, పినియన్ మెకానిజం, చైన్ డ్రైవ్‌లో కదలిక ప్రారంభమవుతుంది. ఈ వేగం ఫ్లైవీల్, రెక్టిఫైయర్, డీసీ మోటారు గుండా వెళుతున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

విద్యుత్ సరఫరా:

రైల్వేలు నేరుగా పవర్ గ్రిడ్ నుండి విద్యుత్తును పొందుతాయి. గ్రిడ్ పవర్ ప్లాంట్ నుండి సరఫరా అవుతుంది. అక్కడి నుంచి అన్ని స్టేషన్లకు పంపుతారు. సబ్ స్టేషన్ నుండి నేరుగా 132 KV సరఫరా రైల్వేలకు వెళుతుంది. ఇక్కడి నుంచి ఓ.హెచ్.ఈ. 25కేవి రైల్వే స్టేషన్ల సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్లు కనిపిస్తాయి. నేరుగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల ట్రిప్పింగ్ ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి