Stock Market: RBI ప్రకటనతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. రూ.247 కోట్లకు చేరిన ఇన్వెస్టర్ల సంపద..

|

Apr 08, 2022 | 4:34 PM

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో(Indices) మూడు రోజుల వరుస నష్టాలకు వారాంతంలో బ్రేక్‌ పడింది. ఈరోజు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి(Monetary policy) విధాన సమీక్ష నిర్ణయాలు ఇన్వెస్టర్లను మెప్పించాయనే చెప్పాలి.

Stock Market: RBI ప్రకటనతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. రూ.247 కోట్లకు చేరిన ఇన్వెస్టర్ల సంపద..
stock market
Follow us on

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో(Indices) మూడు రోజుల వరుస నష్టాలకు వారాంతంలో బ్రేక్‌ పడింది. ఈరోజు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి(Monetary policy) విధాన సమీక్ష నిర్ణయాలు ఇన్వెస్టర్లను మెప్పించాయనే చెప్పాలి. మధ్యాహ్నం వరకు కొంత ఊగిసలాటల్లో కొనసాగిన బెంచ్ మార్క్ సూచీలు.. వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవటంతో పుంజుకున్నాయి. అప్పటికి యూరప్, ఏషియా మార్కెట్లు కూడా సానుకూలంగా పయనిస్తుండడంతో సూచీలకు మరింత దన్ను లభించినట్లయింది. మరోవైపు మదుపర్లు కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొత్తగా కొనుగోళ్లకు మొగ్గుచూపడం కూడా కలిసొచ్చిందని చెప్పుకోవాలి. ఉదయం సెన్సెక్స్‌ సూచీ లాభాలతో ప్రారంభమైంది. చివరికి 412 పాయింట్ల లాభంతో ముగిసింది. మరో కీలక సూచీ నిఫ్టీ సైతం 145 పాయింట్లు లాభంతో ముగిసింది.

సెన్సెక్స్‌ సూచీలోని ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, టైటన్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్ఇండ్ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ షేర్లు ఇంట్రాడేలో 4 శాతం లాభపడి 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం నుంచి రూ.15 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ లభించటంతో.. వొడాఫోన్‌ ఐడియా షేర్లు 4 శాతం మేర లాభపడ్డాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ మరింత వేగంగా వడ్డీరేట్ల పెంపు ప్రక్రియను చేపట్టనుండటంతో.. డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి 100 మార్క్‌ను తాకింది. BSEలో కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.95 లక్షల కోట్లు పెరగటంతో.. ఇన్వెస్టర్ల సంపద రూ.274.20 లక్షల కోట్లకు చేరింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

India – Ukraine: అలాంటి దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.. కైవ్ హత్యలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్

Crime news: దత్త పుత్రికపై రెండేళ్లుగా అత్యాచారం.. తండ్రి, సోదరుల ఘాతుకం.. అసలేం జరిగిందంటే