India Economy: దూసుకుపోతున్న దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌.. భారీగా వృద్ధిరేటు..

| Edited By: Shaik Madar Saheb

Oct 20, 2024 | 5:29 PM

భారతీయ స్మార్ట్‌పోన్‌ మార్కెట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దేశంలో మొబైల్ ఫోన్ ల తయారీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి.. పలు అంచనాలు వెలువడుతున్నాయి.. రాబోయే కాలం భారత్ దే అంటూ పేర్కొంటున్నాయి..

India Economy: దూసుకుపోతున్న దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌.. భారీగా వృద్ధిరేటు..
Smartphone
Follow us on

భారతీయ స్మార్ట్‌పోన్‌ మార్కెట్ శరవేగంగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ప్రస్తుత పండుగ సీజన్‌ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో భారత్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. భారీ డిమాండ్‌ నేపథ్యంలో Smartphone shipment వృద్ధి వైపు దూసుకెళ్తోంది..

స్మార్ట్‌ఫోన్స్‌కు డిమాండ్ పెరగనుందని అంచనా వేస్తున్న కంపెనీలు.. తయారీపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగానే ఈ త్రైమాసికంలో 9శాతం వృద్ధి రేటు సాధించినట్లు అంచనా వేస్తున్నారు. ఎక్కువ మొబైల్స్‌ తయారు చేస్తున్న కంపెనీల జాబితాలో వన్‌ప్లస్‌, రియల్‌మీ కంపెనీలు.. వరుసగా 6.3 మిలియన్, 5.3 మిలియన్ యూనిట్స్‌ షిప్పింగ్‌ చేశాయి. ప్రముఖ మార్కెట్ వశ్లేషకులు సన్యామ్‌ చౌరాసియా మాట్లాడుతూ.. పండుగ సీజన్‌లో డిమాండ్‌ ఉండే అవకాశాలు ఉన్న నేపథ్ంలో మిడ్‌, హైరేంజ్‌ సెగ్మెంట్‌లో మిడ్‌, హై రేజ్‌లో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించాయి. వివో 19 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది.

ఇక కంపెనీల పరంగా చూస్తే వివో 9.1 మిలియన్ల యూనిట్స్‌తో మొదటి వరుసలో నిలిచింది. ఈ కంపెనీ తన మార్కెట్‌ వాటాను 17 శాతం నుంచి 19 శాతానికి పెంచుకుంది. వివో వార్షిక వృద్ధి 26 శాతం పెరగడం విశేషం. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా వివో దూకుడు పెంచింది. ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌పై దృష్టి పటెట్డం వల్లే ఈ వృద్ధి సాధ్యమైంది.

ఇక షావోమీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 7.8 మిలియన్‌ యూనిట్ల షిప్పింగ్‌ ద్వారా రెండో స్థానంలో నిలిచింది. షావోమీ మొత్తం 7.8 మిలియిన్ల యూనిట్స్‌ ఎగుమతి చేసింది. షావోమీ మార్కెట్ వాటా 18 నుంచి 17 శాతానికి స్వల్పంగా క్షీణించింది. అయితే అమ్మకాల విషయంలో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక సాస్‌మంగ్ 7.5 మిలియన్‌ యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..