Vande Bharat: వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?

Vande Bharat Trains: వందే భారత్ రైళ్లు భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన, ఆధునిక రైళ్లు. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించగలవు. వందే భారత్ రైళ్లలో ఎయిర్ కండిషనింగ్, వై-ఫై, పవర్ సాకెట్లు వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి..

Vande Bharat: వందే భారత్ రైళ్లను ఎలా తయారు చేస్తారు? ఎంత మంది పని చేస్తారు..?
Vande Bharat

Updated on: May 23, 2026 | 5:00 PM

Vande Bharat Trains: ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కటిగా దేశ వ్యాప్తంగా ఎన్నో వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే హైస్పీడ్‌ తో నడిచే ఈ రైళ్లలో ఎన్నో అత్యాధునిక ఫీచర్స్‌ ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వందే భారత్ రైళ్లను తయారు చేస్తుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.

ఎంతమంది ఈ పని చేస్తారు?

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నైలోని లక్ష్మీపురంలో ఉంది. ICFలో 18,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడే వందే భారత్ రైళ్లను తయారు చేస్తారు. ICF ఏటా 1,500 కోచ్‌లను తయారు చేస్తుంది. ICF 2018లో వందే భారత్ రైళ్ల తయారీని ప్రారంభించింది కేంద్రం. ఇప్పటివరకు ఐసిఎఫ్ 100కు పైగా వందే భారత్ రైళ్లను తయారు చేసింది.

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.1 లక్షను రూ.21 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్‌..!

ఇవి కూడా చదవండి

వందే భారత్ రైళ్లు భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన, ఆధునిక రైళ్లు. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించగలవు. వందే భారత్ రైళ్లలో ఎయిర్ కండిషనింగ్, వై-ఫై, పవర్ సాకెట్లు వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేవి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారతదేశపు సెమీ-హై స్పీడ్ రైళ్లు.

Vande Bharat Trains

ది కూడా చదవండి: Petrol Price: కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది? ఎలాగో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us