Indian Railways: రైలు టికెట్ లేదా? అర్జెంట్‌గా వెళ్లాలా? టికెట్ లేకుండానే రైలు ఎక్కవచ్చు.. రైల్వే రూల్స్ ఇవే!

Indian Railways: రైలు టికెట్ లేదా? అర్జెంట్‌గా వెళ్లాలా? టికెట్ లేకుండానే రైలు ఎక్కవచ్చు.. రైల్వే రూల్స్ మీకు తెలుసా..? సాధారణంగా టికెట్ లేకుండా రైలు ప్రయాణం నేరం. కానీ, అత్యవసర సమయాల్లో టికెట్ తీసుకునే సమయం లేనప్పుడు భారతీయ రైల్వే ఒక..

Indian Railways: రైలు టికెట్ లేదా? అర్జెంట్‌గా వెళ్లాలా? టికెట్ లేకుండానే రైలు ఎక్కవచ్చు.. రైల్వే రూల్స్ ఇవే!
Indian Railways Rules

Updated on: May 03, 2026 | 7:54 PM

Indian Railways Rules: ఆఖరి నిమిషంలో హడావిడి. మీరు ఎలాంటి ప్రణాళిక లేకుండా అకస్మాత్తుగా ప్రయాణించాల్సి రావచ్చు. ఈలోగా మీ దగ్గర టికెట్ ఉండదు. ఆ సమయంలో టికెట్ కొనడానికి సమయం ఉండదు. ఈలోగా మీరు టికెట్ లేకుండా రైలు ఎక్కితే, మీకు భారీ జరిమానా విధించవచ్చు. కానీ, రైల్వే (ఇండియన్ రైల్వేస్)కు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం మీరు టికెట్ కొనకుండానే రైలు ఎక్కవచ్చు. ఆ అవకాశం ఎక్కడ, ఎలా పొందాలి? రైల్వే నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

కొత్త రైల్వే నిబంధనలు:

రైల్వే నిబంధనల ప్రకారం.. మీ వద్ద తప్పనిసరిగా ప్లాట్‌ఫాం టిక్కెట్ ఉండాలనే విషయం తెలిసిందే. ప్లాట్‌ఫాం టిక్కెట్ కేవలం ప్రవేశ టిక్కెట్ మాత్రమే కాదు. మీరు ఏ స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారో తెలిపే రుజువుగా ఇది పనిచేస్తుంది. స్టేషన్ నుండి మీ చివరి గమ్యస్థానం వరకు ఛార్జీని లెక్కించడానికి TTE ఈ టిక్కెట్‌ను ఉపయోగిస్తారు. ఛార్జీ చెల్లించిన తర్వాత TTE చెల్లుబాటు అయ్యే రసీదును జారీ చేస్తారు. ఇది రైల్వే నిబంధనల ప్రకారం మీ ప్రయాణాన్ని చెల్లుబాటు అయ్యేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి: DMart: డీమార్ట్ బంపర్ ఆఫర్స్.. వేసవి సెలవుల షాపింగ్ ఇక మీ బడ్జెట్‌లోనే.. ఒకటి కొంటే ఒకటి ఉచితం!

ఇవి కూడా చదవండి

అయితే TTE టిక్కెట్ బుక్ చేసుకోవడం ద్వారా మీకు రిజర్వ్డ్ సీటు లభిస్తుందనే హామీ లేదు. సీట్ల కేటాయింపు పూర్తిగా టీటీఈ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. సీటు అందుబాటులో ఉంటే మీకు సీటు లభించవచ్చు. లేకపోతే మీరు జనరల్ కంపార్ట్‌మెంట్‌కు వెళ్లవలసి రావచ్చు. ఒకవేళ మీకు రిజర్వ్డ్ సీటు లేదా కంపార్ట్‌మెంట్ లభించకపోయినా, రైలు టిక్కెట్ ఖరారు అవుతుంది.

టీటీఈ మీ నుండి ఎంత వసూలు చేస్తారు?

ప్రయాణికులు తమ గమ్యస్థానం వరకు టిక్కెట్టు పూర్తి ఛార్జీని చెల్లించాలి. అలాగే చెల్లుబాటు అయ్యే టిక్కెట్టు లేకుండా రైలు ఎక్కితే రూ.250 వరకు జరిమానా విధించవచ్చు. ఈ జరిమానా ఒక సాధారణ నియమం. ఈ జరిమానాలో మీరు ప్రయాణించే స్టేషన్‌ నుంచి దిగాల్సిన స్టేషన్‌ వరకు ఉండే ఛార్జీని బట్టి ఉంటుందని గుర్తించుకోండి.

గుర్తించుకోవాల్సిన విషయాలు:

ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ కేవలం రెండు గంటలకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ప్రయాణికులు గుర్తుంచుకోవాలి. అలాగే మీరు స్వచ్ఛందంగా టీటీఈకి తెలియజేస్తేనే ఈ నియమం వర్తిస్తుంది. TTEకి తెలియజేయకుండా పట్టుబడితే, మరింత కఠినమైన జరిమానాలు విధించబడవచ్చు. అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రయాణ సమయంలో చివరి నిమిషంలో టిక్కెట్ బుక్ చేసుకోలేని వారికి మాత్రమే ఈ ప్రత్యేక ఏర్పాటు వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు? రూ.2,000 మీ అకౌంట్‌లో పడాలంటే ఈ పనులు తప్పనిసరి!

సాధారణంగా టికెట్ లేకుండా రైలు ప్రయాణం నేరం. కానీ, అత్యవసర సమయాల్లో టికెట్ తీసుకునే సమయం లేనప్పుడు భారతీయ రైల్వే ఒక ప్రత్యేక నిబంధనను అందుబాటులోకి తెచ్చింది. ఈ నియమం కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పనికివస్తుంది. వీలైనంత వరకు ఐఆర్‌సీటీసీ (IRCTC) యాప్ లేదా కౌంటర్ ద్వారా ముందే టికెట్ తీసుకోవడం సురక్షితం.

ఇది కూడా చదవండి: Summer Tips: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలా? పైకప్పుపై ఈ చిన్న పని చేయండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us