AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు? రూ.2,000 మీ అకౌంట్‌లో పడాలంటే ఈ పనులు తప్పనిసరి!

PM Kisan 23rd Installment: పీఎం కిసాన్ 22వ విడతను మార్చి 13, 2026న ప్రధానమంత్రి విడుదల చేశారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒక విడత విడుదలవుతుంది. అయితే ఇప్పుడు రాబోయే విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ విడత..

PM Kisan: పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు? రూ.2,000 మీ అకౌంట్‌లో పడాలంటే ఈ పనులు తప్పనిసరి!
Pm Kisan 23rd Installment
Subhash Goud
|

Updated on: May 03, 2026 | 5:48 PM

Share

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని కోట్లాది మంది రైతులు తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 22 విడతల డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 23వ విడత (23rd Installment) వంతు వచ్చింది. అయితే ఈ డబ్బులు మీ ఖాతాలోకి సజావుగా రావాలంటే కొన్ని నిబంధనలు పాటించడం తప్పనిసరి.

ఇది కూడా చదవండి: Summer Tips: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలా? పైకప్పుపై ఈ చిన్న పని చేయండి!

23వ విడత ఎప్పుడు రావచ్చు?

పీఎం కిసాన్ 22వ విడతను మార్చి 13, 2026న ప్రధానమంత్రి విడుదల చేశారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒక విడత విడుదలవుతుంది. ఆ లెక్కన 23వ విడత నిధులు జూన్ లేదా జూలై 2026 మధ్యలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

డబ్బులు ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

చాలామంది రైతులకు కొన్ని చిన్న పొరపాట్ల వల్ల రూ.2,000 జమ కావడం లేదు. మీ ఖాతాలోకి డబ్బులు రావాలంటే ఈ కింది పనులు పూర్తి చేశారో లేదో ఒకసారి చూసుకోండి:

ఇ-కేవైసీ (e-KYC) తప్పనిసరి:

పీఎం కిసాన్ పోర్టల్‌లో ఇ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే నిధులు అందుతాయి. మీరు దీన్ని పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా లేదా దగ్గరలోని సీఎస్‌సీ (CSC) సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అంతేకాకుండా, మీ ఆధార్‌లోని వివరాలు, బ్యాంక్ ఖాతాలోని వివరాలు ఒకేలా ఉండాలి. అలాగే భూమి రికార్డుల ధృవీకరణ తప్పనిసరి. రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ల్యాండ్ సీడింగ్ ‘నో’ (No) అని ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించి దాన్ని సరిచేసుకోవాలి.

మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి:

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in సందర్శించండి.
  • ‘Know Your Status’ పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి, గెట్ డేటా (Get Data) క్లిక్ చేస్తే మీ విడతల వివరాలు కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి: Electric Car: సింగిల్ ఛార్జ్‌తో 710 కి.మీ. రేంజ్.. 9 నిమిషాల్లో 97% ఛార్జ్.. అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్‌ కారు..!

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ పాఠశాలలకు 87 సెలవులు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us