
దేశంలోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 లో పదివేల నాన్ ఏసీ కోచ్ లను ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుంది. కాలానుగుణంగా పెరుగుతున్న అవసరాలు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కోచ్ లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయి. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సౌకర్యాలు కలుగుతాయి.
దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఆధారపడిన ప్రధాన ప్రయాణం సాధనం రైలు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో దేశంలోని నలుమూలలకు రాకపోకలు సాగించవచ్చు. మిగిలిన రవాణా సాధనాలైన బస్సు తదితర వాటితో పోల్చితే వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేష్లన్ల ఎల్లప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. రిజర్వేషన్ బోగీలను పక్కన పడితే సాధారణ బోగిలలో నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు.
ప్రస్తుతం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లలో బోగీలు ఉండడం లేదనేది వాస్తవం. రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణించే వారికి ఇబ్బందులు లేకపోయినా.. సాధారణ బోగీలలో ప్రయాణికులు మాత్రం అవస్థలు పడుతున్నారు. కనీసం నిలబడటానికి కూడా ఖాళీ లేని విధంగా ప్రయాణం సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బోగీలు లేకపోవడమే దీనికి కారణం. ఒక్కోసారి జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు రిజర్వేషన్ బోగీలలో ఎక్కేస్తున్నారు. దీని వల్ల రిజర్వేషన్ టికెట్లు తీసుకున్నవారికీ ఇబ్బందులు తప్పడం లేదు.
భారతీయ రైల్వే రానున్న రెండేళ్లలో సుమారు పదివేల నాన్ ఎయిర్ కండీషన్ కోచ్ లను ఉత్పత్తి చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించే ముఖ్యమైన చర్యగా భావించవచ్చు. రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సేవలందించడం, ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడం, వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చడమే దీని ప్రధాన లక్ష్యం.
2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలలో రికార్డు స్థాయిలో 5,300 సాధారణ కోచ్ లను తయారు చేయాలని రైల్వే అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 2024-25లో 2605 బోగీలు సిద్దం కానున్నాయి. వీటిలో అమృత్ భారత్ 1,470 నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు, 323 ఎస్ఎల్ఆర్ కోచ్‌లు, 32 అధిక కెపాసిటీ పార్శిల్ వ్యాన్లు, 55 ప్యాంట్రీ కార్లు ఉన్నాయి. ఇక 2025-26లో అమృత్ భారత్ 2,710 జనరల్ కోచ్‌లు, 1,910 నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లు, 514 ఎస్ఎల్ఆర్ కోచ్‌లు,
200 అధిక కెపాసిటీ పార్శిల్ వ్యాన్లు, 110 ప్యాంట్రీ కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
దేశంలో పెరిగిన జనాభాతో పాటు ఉద్యోగ, వ్యాపారాల రీత్యా రాకపోకలు సాగించే వారి రద్దీ నేపథ్యంలో రైళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలు తీర్చడం కోసం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోచ్ ల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..