Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో మరో కొత్త నిర్ణయం.. నాన్ వెజ్ వంటకాలపై బిగ్ అప్డేట్..

వందే భారత్ స్లీపర్ రైల్లో ఫుడ్ మోనూపై రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి స్లీపర్ రైళ్లల్లో నాన్ వెజ్ వంటకాలు వడ్డించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కేవలం శాకాహార భోజనం మాత్రమే అందిస్తున్నారు. అయితే నాన్ వెజ్ కూడా పెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో మరో కొత్త నిర్ణయం.. నాన్ వెజ్ వంటకాలపై బిగ్ అప్డేట్..
Vande Harat Sleeper

Updated on: Jan 27, 2026 | 10:02 PM

జనవరి 17న దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. కోల్‌కత్తాలోని హోరా నుంచి అస్సాంలోని గువహతి వరకు ఈ రైలును ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పచ్చజెండా ఊపి తన చేతుల మీదుగా ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు రాకతో రాత్రిపూట ప్రయాణం మరింత సౌకర్యవంతం కాగా.. ప్రయాణ సమయం మూడు గంటలు తగ్గుతుంది. ఇక విమానం తరహాలో లగ్జరీ లుక్‌తో ఈ స్లీపర్ రైల్లో సేవలు ఉన్నాయి. ఇక ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు, అత్యాధునిక టాయిలెట్లు, సీసీ కెమెరాలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక ఈ రైలులో టికెట్‌తో పాటే టిఫిన్, లంచ్, డిన్నర్ ఉచితంగా అందించనున్నారు.

నాన్ వెజ్ ప్రియులకు పండుగే

ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెజ్ వంటకాలు మాత్రమే వడ్డిస్తున్నారు. అయితే నాన్ వెజ్ ఫుడ్ కూడా అందించాలని ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ మేరకు నాజ్ వెజ్ ప్రియులు రైల్వేశాఖకు వినతులు పంపారు. దీనిని పరిశీలించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో నాన్ వెజ్ అందించడంపై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం త్వరలో నాన్ వెజ్ ఫుడ్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే అందించడంపై విమర్శలు వచ్చాయి. నాన్ వెజ్ ప్రియుల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రైల్వేశాఖ స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంది.

అశ్విని వైష్ణవ్ ప్రకటన

ప్రస్తుతం హోరా-గువహతి స్లీపర్ రైల్లో శాకాహారం మాత్రమే సర్వ్ చేస్తున్నారు. కామాఖ్య నుంచి రైలు వచ్చే సమయంలో అసోం రుచులు, హోరా నుంచి బయల్దేరే సమయంలో బెంగాలీ వంటకాలు వడ్డిస్తున్నారు. అయితే బెంగాల్, అస్సాంలో మాంసాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. నాన్ వెజ్ తినేవారు ఎక్కువగా ఉంటారు. దీంతో నాన్ వెజ్ ఫుడ్ అందించాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మాంసాహార వంటకాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. అటు ఇప్పటికే వందే భారత్‌తో పాటు శతాబ్ది, రాజధాని, ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో నాన్ వెజ్ వంటకాలు వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో కూడా మాంసాహార వంటకాలు ప్రవేశపెడతామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. దీంతో నాన్ వెజ్ ప్రియులకు ఊరట కలిగినట్లయింది.