Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ నుంచి కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు!

Indian Railways: ఈ సమ్మర్‌ సీజన్‌లో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి రోజు, అలాగే వీక్లి ఎక్స్‌ప్రెస్‌లను నడపుతోంది. ఇప్పుడు మరో రైలును అందుబాటులోకి తీసుకువస్తోంది రైల్వే శాఖ. మరి ఏ రైలు.. ఏయే ప్రాంతాలకు నడుపుతోంది పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ నుంచి కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు!
Indian Railways

Updated on: May 07, 2026 | 7:34 PM

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ – అనకాపల్లి స్టేషన్ల మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. రైలు నంబర్ 17043/17044 తో ఈ సేవలు క్రమం తప్పకుండా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!

రైలు వివరాలు, నడిచే రోజులు

ఈ రైలు సర్వీసులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

రైలు నంబర్ 17043 (సికింద్రాబాద్ – అనకాపల్లి): ఈ రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఇది 24.05.2026 నుండి అందుబాటులోకి రానుంది.

రైలు నంబర్ 17044 (అనకాపల్లి – సికింద్రాబాద్): ఈ రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. ఇది 18.05.2026 నుండి అందుబాటులోకి రానుంది.

ముఖ్యమైన స్టేషన్లు, సమయాలు:

ఈ రైలు ప్రయాణ మార్గంలో ప్రధాన నగరాల గుండా ప్రయాణిస్తుంది.

  • సికింద్రాబాద్ నుండి అనకాపల్లికి (రైలు నం. 17043):
  • సికింద్రాబాద్‌లో ఆదివారం రాత్రి 21:00 గంటలకు బయలుదేరుతుంది.
  • గుంటూరుకు తెల్లవారుజామున 02:50 గంటలకు, విజయవాడకు 04:40 గంటలకు చేరుకుంటుంది. అలాగే రాజమండ్రికి ఉదయం 07:55 గంటలకు, చివరగా అనకాపల్లికి సోమవారం మధ్యాహ్నం 12:00 గంటలకు చేరుకుంటుంది.

అనకాపల్లి నుండి సికింద్రాబాద్‌కు (రైలు నం.17044):

అనకాపల్లిలో సోమవారం సాయంత్రం 17:35 గంటలకు బయలుదేరుతుంది. రాజమండ్రికి రాత్రి 20:40 గంటలకు, విజయవాడకు అర్థరాత్రి 00:40 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు మంగళవారం ఉదయం 08:40 గంటలకు చేరుకుంటుంది.

ప్రధాన స్టాపింగ్‌లు:

చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి.

కోచ్‌ల వివరాలు:

ఈ రైలులో ప్రయాణికుల సౌకర్యం కోసం వివిధ రకాల ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి.

1 – ఫస్ట్ క్లాస్ ఏసీ (1A)
4 – సెకండ్ ఏసీ (2A)
12 – థర్డ్ ఏసీ (3AC) కోచ్‌లు ఉన్నాయి.

Weekly Express Train

ఇది కూడా చదవండి: Army Canteen: ఆర్మీ క్యాంటీన్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయో తెలుసా? ఆ ‘సీక్రెట్’ తెలిస్తే షాక్ అవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us