
Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న కొత్త వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సాంకేతికతను ఉపయోగించి బిఈఎమ్ఎల్ (BEML) ఈ రైలును అభివృద్ధి చేసింది. నారింజ (ఆరెంజ్), బూడిద (గ్రే) రంగుల కలయికతో ఉన్న ఈ సరికొత్త రైలు కెఎస్‌ఆర్ బెంగళూరు – ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ – ముంబై మధ్య నడవనుంది. దేశంలోనే ఇది రెండవ వందే భారత్ స్లీపర్ రైలు కావడం విశేషం. కాగా, దేశంలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలును జనవరి 2026 లో హౌరా – కామాఖ్య మధ్య ప్రారంభించారు. ఇది ప్రయాణ సమయాన్ని దాదాపు ఆరు గంటల వరకు తగ్గించింది).
బెంగళూరు – ముంబైలను కలుపుతూ కొత్త వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభమవుతుందని గతంలోనే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా బెంగళూరు, హుబ్బళ్ళి-ధార్వాడ్ ప్రాంతం, బెల్గావి, పూణే – ముంబై మధ్య ప్రయాణించే ప్రయాణికులకు రైలు కనెక్టివిటీ, సౌకర్యం మరింత మెరుగుపడనుంది.
ప్రస్తుతం ఈ రైలు తుది పరీక్షల (Final Testing) కోసం బెంగళూరులోని ఎస్‌ఎమ్‌విటి (SMVT) స్టేషన్‌లో ఉంచారు. సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) డాక్టర్ మంజునాథ్ కనమడి తెలిపిన వివరాల ప్రకారం, ఈ రైలు ఇంకా పూర్తిగా భారతీయ రైల్వేకు అప్పగించలేదు. ప్రస్తుతం BEML ఆధ్వర్యంలోనే తుది తనిఖీలు, పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని రకాల ట్రయల్స్, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాత ఈ రైలును అధికారికంగా లాంచ్ చేయనున్నారు.
ఈ రైలులో ప్రయాణికులకు అత్యంత ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేలా డిజైన్ చేశారు. దీని ముఖ్యమైన ఫీచర్లు ఇవే:
ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా? తాజా రేట్ల వివరాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి