రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

హోలీ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సహా భారతీయ రైల్వేలు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. చర్లపల్లి–దానాపూర్, మచిలీపట్నం–జగదల్‌పూర్, యశ్వంత్‌పూర్–సంత్రాగచ్చి, పోదనూరు–బరౌని మార్గాల్లో ఈ స్పెషల్ రైళ్లు నడుస్తాయి. ప్రయాణికులు ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
Trains 5

Updated on: Feb 28, 2026 | 3:16 PM

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సహా భారతీయ రైల్వేలు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉండేలా ఈ స్పెషల్ సర్వీసులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం నాలుగు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.

చర్లపల్లి–దానాపూర్ (07097/07098) మధ్య రెండు సర్వీసులు నడుస్తాయి. 07097 రైలు ఫిబ్రవరి 28న రాత్రి 8.30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మార్చి 2న ఉదయం 9.30కు దానాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07098 రైలు మార్చి 2న 11.30కు బయలుదేరి 23.45కు చర్లపల్లి చేరుతుంది. ఈ రైళ్లు కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా తదితర స్టేషన్లలో ఆగుతాయి. AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

మచిలీపట్నం–జగదల్‌పూర్ (07998) ప్రత్యేక రైలు ఫిబ్రవరి 28న రాత్రి 23.00కు బయలుదేరి మరుసటి రోజు 18.30కు చేరుతుంది. గుడివాడ, భీమవరం టౌన్, రాజమండ్రి, అరకు, కోరాపుట్ వంటి ముఖ్య స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. యశ్వంత్‌పూర్–సంత్రాగచ్చి (06233/06234) మధ్య రెండు ప్రత్యేక సర్వీసులు ప్రకటించారు. మార్చి 1న యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే రైలు ధర్మవరం, గుంటూరు, విజయవాడ, భువనేశ్వర్, కటక్ మీదుగా ప్రయాణిస్తుంది. తిరుగు రైలు మార్చి 3న నడుస్తుంది.

అదే విధంగా పోదనూరు–బరౌని (06021/06022) మధ్య నాలుగు సర్వీసులు ఏర్పాటు చేశారు. మార్చి 2, 9 తేదీల్లో ఒక దిశలో, మార్చి 5, 12 తేదీల్లో తిరుగు ప్రయాణం ఉంటుంది. విజయవాడ, వరంగల్, నాగ్‌పూర్, జబల్‌పూర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి. హోలీ సీజన్‌లో టికెట్లు త్వరగా నిండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us