Indian Railways: ట్రైన్ లేదా రైల్వే స్టేషన్లలో ఈ తప్పు చేస్తే బాదుడే.. ఏకంగా రూ.5 వేల జరిమానా.. జులై 1 నుంచే అమల్లోకి..

రైల్వేశాఖ జరిమానా నిబంధనల్లో సవరణలు చేసింది. రైల్వే నిబంధనలను ఉల్లంఘించేవారిపై విధించే ఫైన్లను భారీగా పెంచింది. రెట్టింపు చేస్తూ తాజాగా రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. వీటి గురించి సమాచారం చూస్తే..

Indian Railways: ట్రైన్ లేదా రైల్వే స్టేషన్లలో ఈ తప్పు చేస్తే బాదుడే.. ఏకంగా రూ.5 వేల జరిమానా.. జులై 1 నుంచే అమల్లోకి..
Indian Railways

Updated on: Jun 20, 2026 | 9:47 AM

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లల్లో టికెట్ తీసుకోకుండా ప్రయాణించేవారిపై కొరఠా ఝురిపించనుంది. ఈ మేరకు టికెట్ లేకుండా ప్రయాణించేవారిపై విధిస్తున్న జరిమానాను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు టిక్కెట్లు లేకుండా ప్రయాణించేవారికి విధిస్తున్న జరిమానాకు రెట్టింపు చేసింది. గతంలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ పట్టుబడితే కనీసం రూ.250 జరిమానా విధించేవారు. ఇప్పుడు దానిని రూ.500కు పెంచారు. దీంతో ఇక నుంచి టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే బాదుడు తప్పదు. ఇక వేరొకరి టిక్కెట్టుపై కూడా ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తారు. ఈ కొత్త నిబంధనల గురించి తెలియజేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ జూన్ 18న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్‌లకు ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

రూ.500 జరిమానా

వేరొకరి పేరు మీద టిక్కెట్లు బుక్ చేసుకుని ప్రయాణించే వారిపై కూడా భారీగా జరిమానా విధించనున్నారు. ప్రయాణికుడు పూర్తి టిక్కెట్టు ఛార్జీతో పాటు కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుడు చెల్లించకపోతే ఈ విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్లవచ్చు. ఇక రైళ్లలో వస్తువులు అమ్మడం, భిక్షాటన చేయడంపై కూడా జరిమానా పెంచారు. రైళ్లలో లేదా రైల్వే స్టేషన్లలో అనుమతి లేకుండా వస్తువులు అమ్మినా, వీధి వ్యాపారం చేసినా, కొనుగోళ్లు చేయమని ప్రయాణికులను కోరినా రూ.2 వేల వరకు జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించపతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుది. కోర్టులో మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. పదేపదే నేరం చేసేవారికి ఒక ఏడాది వరకు జైలు శిక్ష పడవచ్చు.

మద్యం సేవించేవారిపై చర్యలు

ఇక రైళ్లు, రైల్వే స్టేషన్లలో మద్యం సేవించి గొడవ సృష్టించే వారిపై కూడా చర్యలు తీసుకుంటారు. రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో మద్యం మత్తులో ప్రయాణికులను వేధించే, దుర్భాషలాడే, గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి వ్యక్తులను రైలు నుండి దించివేసి జరిమానా విధిస్తారు. అలాగే ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.కొత్త నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు, ఉద్యోగులకు తెలియజేయాలని అన్ని జోన్లకు రైల్వే శాఖ ఉత్తర్వులు పంపింది. వీ అమలు చేసేలా చూడాలని రైల్వే బోర్డు పేర్కొంది. ఏ స్థాయిలోనైనా పాత నిబంధనల ఆధారంగా చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం రైల్వే ప్రాంగణంలో టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం, టిక్కెట్ల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే ఈ మార్పుల ఉద్దేశమని రైల్వేశాఖ పేర్కొంది.

Follow Us