
Indian Railways: రైల్వే స్టేషన్‌కు వెళ్లి పార్సిల్ బుక్ చేయడం, అక్కడి ఫారాలు నింపడం వంటి ఇబ్బందులకు త్వరలో చెక్ పడనుంది. భారతీయ రైల్వే ‘రైల్ పార్సెల్ యాప్ – ఘర్ సే ఘర్ తక్’ (RailParcel – Ghar Se Ghar Tak) పేరుతో డోర్ టు డోర్ పార్సిల్ సేవను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ సేవ ద్వారా ఇంటి వద్దే పార్సిల్‌ను తీసుకుని, గమ్యస్థానంలో నేరుగా వినియోగదారుల ఇంటికి చేరవేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైనట్లు తెలుస్తోంది.
ప్రారంభ దశలో ఈ నగరాల్లో ఈ సేవ అందుబాటులోకి రానుంది:
ఈ నగరాల ప్రజలు మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే పార్సిల్ పికప్, డెలివరీ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే చెల్లింపులు చేసే సదుపాయం కూడా ఉంటుంది.
ఈ సేవలో మూడు ప్రధాన దశలు ఉంటాయి.
రైల్వే బుకింగ్ నిబంధనలు ఇవి:
పార్సిల్‌ను లాజిస్టిక్స్ సంస్థ పికప్ చేయకముందే బుకింగ్ రద్దు చేస్తే, రైల్వే రూ.10 క్లర్కేజ్ ఛార్జీని మినహాయించి మిగిలిన రైల్వే రవాణా ఛార్జీని తిరిగి చెల్లిస్తుంది. అయితే ఇంటి నుంచి పికప్ చేయడం, ఇంటికి డెలివరీ చేయడం కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయంలో సంబంధిత లాజిస్టిక్స్ సంస్థ నిబంధనలు వర్తిస్తాయి. ఈ వివరాలను బుకింగ్ సమయంలోనే వినియోగదారులకు తెలియజేస్తారు.
పండుగల సమయంలో వస్తువులను పెద్ద మొత్తంలో రవాణా చేసే వ్యాపారులకు కూడా రైల్వే రాయితీ ప్రకటించినట్లు కథనం వెల్లడించింది. పార్సిల్ అగ్రిగేటర్లు ఒకవైపు ప్రయాణానికి వర్తించే రైల్వే ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించి, రౌండ్ ట్రిప్ పార్సిల్ కోచ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా అర్హత కలిగిన రౌండ్ ట్రిప్ బుకింగ్‌లలో మొత్తం రవాణా ఛార్జీపై 25 శాతం ఆదా అవుతుంది. అయితే ఈ రాయితీ అన్ని సాధారణ పార్సిల్ బుకింగ్‌లకు వర్తించదు. ఇది రౌండ్ ట్రిప్ పార్సిల్ కోచ్ బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది.
రైల్వే ప్రవేశపెట్టనున్న ఈ డోర్ టు డోర్ పార్సిల్ సేవ అందుబాటులోకి వస్తే, ముఖ్యంగా హైదరాబాద్ సహా ఎంపిక చేసిన నగరాల్లోని ప్రజలకు పార్సిళ్లను పంపడం మరింత సులభం కానుంది. స్టేషన్‌కు వెళ్లే సమయం, రవాణా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
గమనిక: ఈ సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సేవ ప్రారంభమైన ఖచ్చితమైన తేదీ, పార్సిల్ ఛార్జీలు, యాప్ డౌన్లోడ్ వివరాలను అధికారికంగా నిర్ధారించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి