Indian Railways: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఇకపై పార్శిళ్లకు ఫుల్ గ్యారెంటీ.. అమలులోకి కొత్త ఫీచర్!

|

Feb 22, 2023 | 5:06 PM

మీరు మీ పార్శిళ్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రాంతానికి రైళ్ల ద్వారా పంపించవచ్చునన్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడప్పుడూ..

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఇకపై పార్శిళ్లకు ఫుల్ గ్యారెంటీ.. అమలులోకి కొత్త ఫీచర్!
Indian Railways
Follow us on

మీరు మీ పార్శిళ్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రాంతానికి రైళ్ల ద్వారా పంపించవచ్చునన్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడప్పుడూ ఆ పార్శిళ్లు దొంగతనానికి గురవుతుంటాయి. ఇకపై ఆ భయం అవసరం లేదు. గూడ్స్, పార్శిల్ రైళ్లలో వస్తువులు దొంగతనం కాకుండా ఉండేలా రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంది. ఇందుకోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. భారతీయ రైల్వే OTP ఆధారిత ‘డిజిటల్ లాక్ సిస్టమ్’ని ప్రారంభించాలని నిర్ణయించింది. తద్వారా ప్రయాణికులు పార్శిల్ చేసిన వస్తువులు దొంగల బారిన పడకుండా కాపాడవచ్చునని భావిస్తోంది. అంటే ఇకపై మీరు మీ పార్శిల్‌ను ఎలాంటి ఇబ్బంది, టెన్షన్ పడకుండా రైళ్ల ద్వారా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. ఈ సరికొత్త ఫీచర్ రైళ్లలో రవాణా అవుతున్న వస్తువులకు మెరుగైన భద్రతను అందించడంతో పాటు దొంగతనాల సంఘటనలను కూడా తగ్గిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

రైళ్లలో స్మార్ట్ లాక్ ఏర్పాటు..

ట్రక్కుల్లో ఉపయోగించే విధానం మాదిరిగానే జీపీఎస్‌తో కూడిన ‘స్మార్ట్‌లాక్‌’లను గూడ్స్‌, పార్శిళ్లను తీసుకెళ్లే రైళ్లలో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. జీపీఎస్ సిస్టమ్ ద్వారా వాహనం ఎక్కడ ఉందో గుర్తించడం ద్వారా దొంగతనాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. కొత్త సిస్టమ్ పూర్తిగా OTPపై ఆధారపడి ఉంటుంది, ఈ వన్ టైం పాస్‌వర్డ్ రైలు కంపార్ట్‌మెంట్ తలుపులను తెరవడానికి, మూసివేయడానికి ఉపయోగబడుతుంది. ఓటీపీ ద్వారా కంపార్ట్‌మెంట్‌ తెరవడం, మూసివేయడం వల్ల ఎవరూ కూడా పార్శిల్ లేదా లగేజీని యాక్సెస్ చేయలేరని ఓ రైల్వే అధికారి తెలిపారు. అంతేకాకుండా కోచ్‌లను సీల్ చేయడంతోపాటు ట్యాంపరింగ్ జరగకుండా ప్రతి స్టేషన్‌లో సీల్‌ను పర్యవేక్షిస్తారు. ఉల్లంఘన జరిగితే, అధికారి మొబైల్ నంబర్‌కు వెంటనే అలెర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. కాగా, ఈ సరికొత్త ఫీచర్ రైల్వే పార్శిల్ సిస్టమ్‌ సమర్థవంతంగా పని చేయడానికి దోహదపడుతుంది. లోడింగ్ లేదా అన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తయిందని చెప్పే విధంగా ప్రతి స్టేషన్‌లో ఒక రైల్వే ఉద్యోగికి OTP అందుతుంది.