IOCL Recruitment 2021: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

| Edited By: Pardhasaradhi Peri

Feb 11, 2021 | 7:30 PM

IOCL Recruitment 2021: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ..

IOCL Recruitment 2021: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌
Follow us on

IOCL Recruitment 2021: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 346 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, దాద్రానగర్‌హవేలీలో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్‌ పోస్టులు మాత్రమే. ఏడాది కాలం అప్రెంటీస్‌ శిక్షణ ఉంటుంది. ఈ నోటిఫికేస్‌కు సంబంధించి పూర్తి వివరాలను https://iocl.com/ వెబ్‌ సైట్‌లో, టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ అభ్యర్థులు https://portal.mhrdnats.gov.in/ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభం – 2021 ఫిబ్రవరి 5
దరఖాస్తు చివరి తేదీ – 2021 మార్చి 7
రాత పరీక్ష – 2021 మార్చి 21
అయితే ఎంపికైన అభ్ర్థుల జాబితా ప్రకటన 2021 మార్చి 25

విద్యార్హతలు:

ట్రేడ్‌ అప్రెంటీస్‌ పోస్టులకు ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెనికాక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెషినిస్ట్‌ లాంటి ట్రేడ్స్‌లో ఐటీఐ పాస్‌ కావాలి. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాస్‌ కావాల్సి ఉంటుంది. ట్రేడ్‌ అప్రెంటీస్‌ అకౌంటెంట్‌ పోస్టుకు ఫుల్‌ టైమ్‌ డిగ్రీ కావాలి. ట్రేడ్ అప్రెంటీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఇంటర్మీడియేట్‌తోపాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌లో స్కిల్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు 18 నుంచి 24 ఏళ్లు. ఎంపిక విధానం రాతపరీక్ష ద్వారానే.

SBI Home Loan: గృహ రుణాల వ్యాపారంలో దూసుకుపోతున్న ఎస్‌బీఐ.. రూ. 5 లక్షల కోట్ల మార్కు దాటిన బిజినెస్‌