ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ‘ఇండియన్ బ్యాంకు’ లో ఖాతా తెరవాలనుకునే వారి కోసం ఆ సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు ఖాతా తెరవడానికి తమ బ్యాంకు శాఖకు రావాల్సిన అవసరం లేకుండా మంగళవారం వీడియో కేవైసీని ప్రారంభించింది. ‘వీడియో బేస్ట్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్(VCIP)’ టెక్నాలజీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ క్రమంలో వీడియో కేవైసీ ద్వారా అకౌంట్ తెరవాలనుకునేవారు మొబైల్ నంబర్, ఈమెయిల్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, కెమెరా, మైక్రోఫోన్ ఉన్న కంప్యూటర్/ ల్యాప్‌టాప్‌తో బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చని సూచించింది. యూఐడీఏఐ నంబర్ , ఓటీపీ ఆధారంగా ఖాతాదారుడి వివరాలను ధ్రువీకరిస్తామని పేర్కొంది.
త్వరలోనే అన్ని సేవలకు..
ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఏటీఎం కార్డ్, చెక్‌బుక్, పాస్‌బుక్ ఖాతాదారుడి చిరునామాకు నేరుగా వస్తాయని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. అకౌంట్ ఓపెనింగ్ సందర్భంగా అవసరమయ్యే కనీసం మొత్తాన్ని కూడా ఆన్‌లైన్‌లోనే పంపవచ్చని వారు సూచించారు. ఆతర్వాత ఏటీఎం కార్డ్, మొబైల్ బ్యాంకింగ్‌తో నిరంతర లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. ‘జియోయ్ బిజినెస్ సొల్యూషన్స్’ సంస్థ సహకారంతో ఇండియన్ బ్యాంక్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు కేవలం ఖాతా తెరవడానికే వీడియో కేవైసీని ప్రారంభిస్తున్నామని రానున్న రోజుల్లో మరిన్ని సేవలకు విస్తరిస్తామని బ్యాంకు స్పష్టం చేసింది.
Also Read:
Olectra Greentech: అమాంతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆదాయం.. సెకండ్ క్వార్టర్‌లో భారీ వృద్ధి..!
PF Clients: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. కనీస పెన్షన్ పెంచే అవకాశాలు..! ఎంతంటే..?
Vivo నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP సెల్ఫీ కెమెరా 64MP బ్యాక్ కెమెరా.. ధర ఎంతో తెలుసా..?