వందేళ్ల చరిత్రకు వేదిక కానున్న భారత్‌.. కామన్వెల్త్ గేమ్స్‌ 2030 మన దగ్గరే! 2010లోనే రూ.70 వేల కోట్ల ఖర్చు.. ఈ సారి..!

2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. కామన్వెల్త్ గేమ్స్ వందేళ్ల శతాబ్ది వేడుకలను భారత్ నిర్వహించడం, 2036 ఒలింపిక్స్ బిడ్‌కు ఇది కీలక మలుపు. గత 2010 ఢిల్లీ క్రీడల మాదిరిగానే, ఈ ఈవెంట్ ద్వారా పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయల కల్పనలో గణనీయమైన పెట్టుబడులు వస్తాయి.

వందేళ్ల చరిత్రకు వేదిక కానున్న భారత్‌.. కామన్వెల్త్ గేమ్స్‌ 2030 మన దగ్గరే! 2010లోనే రూ.70 వేల కోట్ల ఖర్చు.. ఈ సారి..!
2030 Commonwealth Games Ind

Updated on: Nov 28, 2025 | 7:27 PM

2030 కామన్వెల్త్ క్రీడలు చారిత్రాత్మకంగా జరగనున్నాయి. కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం అయ్యి 2030 నాటికి వందేళ్లు పూర్తి అవుతాయి. దీంతో భారత్‌ కామన్వెల్త్‌ శతాబ్ది ఉత్సవాలకు భారత్‌ వేదిక కానుంది. మన దేశంలో రెండోసారి ఈ క్రీడలు జరగనున్నాయి. 2010లో ఢిల్లీ వేదికగా భారత్‌ మొదటి సారి కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ 2030లో కామన్వెల్త్‌ గేమ్స్‌ను అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనుంది. 2036 ఒలింపిక్స్ కోసం తన బిడ్‌ను బలోపేతం చేయడానికి ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌ను భారత్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొనుంది.

2010 కామన్వెల్త్ క్రీడలను ఢిల్లీలో నిర్వహించినప్పుడు ప్రారంభంలో రూ.16,000 కోట్లను నిర్వహణ వ్యయంగా అంచనా వేశారు. కానీ, క్రీడలు ముగిసే సమయానికి ఖర్చు రూ.70,000 కోట్లకు చేరుకుంది. 72 దేశాల భాగస్వామ్యంతో జరిగే ఈ క్రీడలు ఖరీదైనవి కావచ్చు, కానీ వాటితో పాటు జరిగే పట్టణాభివృద్ధి చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అందుకే భారతదేశం 2030 క్రీడలను నిర్వహించడాన్ని ఒక క్రీడా కార్యక్రమంగా కాకుండా, దీర్ఘకాలిక జాతీయ పెట్టుబడిగా చూస్తోంది.

ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత గేమ్స్ విలేజ్, స్టేడియం, విమానాశ్రయం, మెట్రో, రోడ్లు, అనేక ఇతర నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమం నుండి అహ్మదాబాద్‌లో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. కామన్వెల్త్‌ గేమ్స్‌తో పరోక్షంగా నగర భవిష్యత్తు మారిపోనుంది. భారత్‌తో పాటు నైజీరియా కూడా కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణకు ఆసక్తి చూపాయి. అయితే భారత్‌ ప్రతిపాదన గేమ్స్ ఫెడరేషన్ ప్రాధాన్యత ఇచ్చిన వివరాలు, ప్రణాళిక, వనరులు మెరుగ్గా ఉండటంతో ఫెడరేషన్‌ భారత్‌కు అవకాశం కల్పించింది. అయితే 2030లో జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌కు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి