Apple iphone: ప్రధాని మోదీ కన్న కల ఫలించింది.. భారత్‌ నుంచి 10 వేల కోట్ల విలువైన ఐఫోన్ల ఎగుమతి..

ప్రధాని నరేంద్ర మోదీ 'మేక్‌ ఇన్‌ ఇండియా' కల సాకారం అవుతోంది. భారతదేశం ప్రపంచానికి వస్తువుల ఫ్యాక్టరీగా మారాలని ఆయన కన్న కలలు విజయం సాధించేందకు చేరువలో ఉంది. యాపిల్ ఐఫోన్‌ను భారతదేశంలో తయారు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఈ కల నెరవేరుతున్నట్లు కనిపిస్తోంది.

Apple iphone: ప్రధాని మోదీ కన్న కల ఫలించింది.. భారత్‌ నుంచి 10 వేల కోట్ల విలువైన  ఐఫోన్ల ఎగుమతి..
India Iphone Pm Modi

Updated on: Jun 20, 2023 | 1:30 PM

PM Modi US Vist: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం కన్న ‘మేక్ ఇన్ ఇండియా’ కలను యాపిల్ ఐఫోన్ కొత్త శిఖరాలకు చేర్చింది. భారతదేశం నుంచి స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతి పెరుగుతుందని ఆపిల్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే ధృవీకరించబడింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో దేశం నుండి రూ. 20,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతి సంతోషాన్నిస్తుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి రెండు నెలల్లో రూ.9,066 కోట్ల ఎగుమతి కంటే దాదాపు రెట్టింపు అనిచెప్పవచ్చు.

ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ డేటా ప్రకారం, ఏప్రిల్-మేలో భారతదేశం నుంచి రూ. 20,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. ఇందులో మే నెలలోనే రూ.12,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. మే నెలలో ఎగుమతి చేసిన మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో రూ.10,000 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్‌లు మాత్రమే ఎగుమతి కావడం అతిపెద్ద ఆశ్చర్యం.

PLI పథకం విజయం

దేశం మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో యాపిల్ ఐఫోన్ వాటా 80 శాతం. మిగిలిన కంపెనీలు దక్షిణ కొరియాకు చెందిన  Samsung, భారతదేశంలోని కొన్ని స్థానిక బ్రాండ్‌లను కలిగి ఉన్నాయి. ఇవి ఇక్కడి నుంచి స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేస్తాయి. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఆపిల్ కంపెనీ భారతదేశం నుంచి ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. అటువంటి లక్ష్యాన్ని సాధించిన మొదటి బ్రాండ్‌గా ఆపిల్ కంపెనీ నిలిచింది.

భారతదేశం నుంచి యాపిల్ ఐఫోన్ ఎగుమతి పెరగడం ప్రభుత్వ  పీఎల్ఐ పథకం విజయంగా పరిగణించవచ్చు. ఈ పథకం కింద, దేశంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల స్థానిక తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

టెస్లాను ఆకర్షించడానికి ఆపిల్ విజయం

తాజాగా యాపిల్ ఇండియాపై తన దృష్టిని పెంచింది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కంపెనీ తన రిటైల్ స్టోర్లను కూడా ప్రారంభించింది. ఆపిల్ అందించిన ఈ విజయం ఇతర అమెరికన్ కంపెనీలను భారతదేశానికి రప్పించేందుకు సహాయపడుతాయని అంచనా.. ముఖ్యంగా టెస్లాను భారత్ రప్పించేందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అమెరికా కంపెనీలతో సమావేశం కానున్నారు.

ఈ సమావేశంలో, భారతదేశం Apple విజయాన్ని, PLI పథకాన్ని ఉదాహరణగా ప్రదర్శించవచ్చు. అమెరికా కంపెనీలు తమ సరఫరా గొలుసును చైనా నుంచి భారత్‌కు మార్చుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం