భారత్‌ – EU ఒప్పందాన్ని.. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌ అని ఎందుకంటున్నారు? దీన్ని వల్ల ఏంటి లాభం?

దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత భారత్-EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనివల్ల యూరోపియన్ లగ్జరీ కార్లు, విమానాలు, ఎలక్ట్రానిక్స్, వైన్లు వంటి అనేక వస్తువులు భారత్‌లో చౌకగా లభిస్తాయి. ప్రధాని మోదీ దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు.

భారత్‌ - EU ఒప్పందాన్ని.. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌ అని ఎందుకంటున్నారు? దీన్ని వల్ల ఏంటి లాభం?
India Eu Fta

Updated on: Jan 28, 2026 | 6:40 AM

భారత్‌, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన విషయం తెలిసిందే. దీని కోసం ఇరుపక్షాలు 2007 నుండి చర్చలు జరుపుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల చర్చల తర్వాత ఈ ఒప్పందం ఖరారు అయింది. దీనివల్ల యూరోపియన్ యూనియన్ నుండి భారతదేశానికి వచ్చే అనేక వస్తువులు చౌకగా లభిస్తాయి. అయితే ఈ భాత్‌ – EU FTAని ప్రకటిస్తూ ప్రధానమంత్రి మోదీ దీనిని ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌’ అని అభివర్ణించారు.

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఏకీకరణకు ఈ ఒప్పందం ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఒప్పందం ప్రపంచ GDPలో దాదాపు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే ప్రధాని మోదీ దీన్ని అద్భుతంగా వర్ణిస్తూ అలా అన్నారు. కాగా ఈ ఒప్పందం కారణంగా మన దేశంలో మెర్సిడెస్, విమానం, ఎలక్ట్రానిక్స్, యూరోపియన్ వైన్లు వంటి లగ్జరీ కార్లు చౌకగా మారతాయి. ఇది సేవా రంగంలో భారతీయులకు కొత్త అవకాశాలను కూడా తెరుస్తుంది. ఎమ్కే గ్లోబల్ ప్రకారం, రెండింటి మధ్య వాణిజ్యం 2031 నాటికి 51 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

ఈ ఒప్పందంతో ధర తగ్గేవి ఇవే..

  • మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, పోర్స్చే వంటి లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయి.
  • 15,000 యూరోలు (16.3 లక్షల రూపాయలు) కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై 40 శాతం సుంకం మాత్రమే విధించబడుతుంది.
  • విమానాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రసాయనాలు, అధునాతన వైద్య పరికరాలు, మెటల్ స్క్రాప్ కూడా చౌకగా మారవచ్చు.
  • భారత మార్కెట్లో యూరోపియన్ మద్యం ధరలు తగ్గవచ్చు.
  • భారతీయులు ఐటీ, ఇంజనీరింగ్, టెలికాం మరియు వ్యాపారం వంటి సేవా రంగాలలో అవకాశాలను కనుగొంటారు.
  • వాణిజ్యం 50 బిలియన్‌ డాలర్లకు మించిపోతుంది
  • ఎమ్కే గ్లోబల్ పరిశోధన నివేదిక ప్రకారం.. భారత్‌, యూరోపియన్ యూనియన్ మధ్య FTA 2031 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 51 బిలియన్‌ డాలర్లకు (రూ.4,67,925 కోట్లు) పెంచుతుందని అంచనా. దీని వలన భారతదేశ ఎగుమతులు కూడా పెరుగుతాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి