AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6G Technology: భారత్‌లో 6జీ ఎప్పుడంటే..? అసలు క్లారిటీ వచ్చేసింది..! అప్పటిలోగా సేవలు..

భారత్‌లో 6జీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో 6జీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6జీ నెట్‌వర్క్‌పై అధ్యయనాలు జరుగుతున్నాయి. భారత్ కూడా రేసులో ఉంది.

6G Technology: భారత్‌లో 6జీ ఎప్పుడంటే..? అసలు క్లారిటీ వచ్చేసింది..! అప్పటిలోగా సేవలు..
6g Technology
Venkatrao Lella
|

Updated on: Oct 13, 2026 | 1:22 PM

Share

ఇంటర్నెట్ ప్రపంచంలో మనం ప్రస్తుతం 5జీ వేగాన్ని ఆస్వాదిస్తున్నాము. అయితే టెక్నాలజీ ఎప్పుడూ ఒకచోట ఆగిపోదు. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా వేగం మరింత పెరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఇండియాలో ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 6జీ ఇంటర్నెట్ శకానికి నాంది పలికింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఆచరణలోనూ అద్భుతాలు సృష్టించగలమని నిరూపిస్తోంది. జియో సంస్థ ఇప్పటికే దేశంలోనే తొలి గీగా మైమో రేడియోను ఆవిష్కరించింది. ఇది 5జీ, 6జీ రెండూ నెట్ వర్క్‌లకు సపోర్ట్ చేస్తోంది. ఇటీవల ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఈ కామన్ బేస్ బ్యాండ్ యూనిట్‌ను జియో ఆవిష్కరించింది. జియో ఆవిష్కరించిన ఈ గీగా మైమో రేడియో టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇది భారతదేశాన్ని భవిష్యత్తు డిజిటల్ ప్రపంచంలో ముందు వరుసలో నిలుపుతోంది.

భారత్‌లో 6జీ ఎప్పుడంటే..?

భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో 6G టెక్నాలజీపై ప్రజల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా 5G నెట్‌వర్క్ కంటే పది రెట్లు అధిక వేగాన్ని అందించగల సామర్థ్యం 6Gకి ఉంటుందని అంచనాలున్నాయి. 6జీ డిజిటల్ ఇండియా విజన్ మరింత వేగవంతం కానుంది. భారత్‌లో జియో 6G పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ వ్యవస్థపై జియో చురుకుగా పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6G పరిశోధనలు జరుగుతున్నాయి. జియో కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. 2030 నాటికి 6జీ టెక్నాలజీకి సంబంధించిన ప్రపంచ ప్రమాణాలు ఖరారు కానున్నాయి. దీంతో ఈ ప్రమాణాలు ఖరారు అయిన తర్వాత 6జీ సేవలను ప్రారంభించే తొలి దేశాల్లో భారత్ ఒకటి కానుందని తెలుస్తోంది. 2030 నాటికి భారత్‌లో 6జీకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

6జీ నెట్‌వర్క్ కేవలం వేగం మాత్రమే కాకుండా.. అనేక నూతన తరం డిజిటల్ సేవలకు, అప్లికేషన్‌లకు మద్దతునిస్తుంది. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), అత్యాధునిక స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ వంటి సాంకేతికతలకు 6G కీలకమైనదిగా చెబుతున్నారు. దీని ద్వారా డేటా ప్రసారం మరింత సమర్థవంతంగా, తక్కువ జాప్యంతో జరుగుతుంది. ఇది వినూత్న డిజిటల్ పరిష్కారాలకు మార్గం సుగమం చేస్తుంది. భారత్‌లో 6జీ అందుబాటులోకి వస్తే డిజిటల్ మౌలిక సదుపాయాలు పూర్తిగా మారనున్నాయి. ఇది దేశవ్యాప్తంగా పౌరులకు, వ్యాపారాలకు, ప్రభుత్వ రంగాలకు మెరుగైన డిజిటల్ సేవలను అందించడంలో తోడ్పడుతుంది. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడం ద్వారా భారత్ ప్రపంచ డిజిటల్ రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Follow Us