Gold Purchase: బంగారం కొనుగోళ్లకు ఆధార్, పాన్ ఎందుకు? ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయ్?

అయితే బంగారం కొనుగోళ్లపైనా ఇన్ కమ్ ట్యాక్స్ నిఘా ఉంటుందని మీకు తెలుసా? పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తే తప్పనిసరిగా మీ ఐడీ ప్రూఫ్ లను సమర్పించాల్సి ఉంటుంది. అలా కానీ పక్షంలో చట్ట ప్రకారం మీరు శిక్షార్హులు అవుతారు. ఈ నేపథ్యంలో అసలు బంగారం కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలేమిటి? ఎంత మొత్తంలో మాత్రమే నగదుతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా కొనుగోళ్లు చేయొచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Gold Purchase: బంగారం కొనుగోళ్లకు ఆధార్, పాన్ ఎందుకు? ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయ్?
Gold

Updated on: Jan 15, 2024 | 6:07 PM

బంగారం అనేది మన సంస్కృతి ప్రతీక. ఏ శుభకార్యమైనా మొదట గుర్తొచ్చేది బంగారమే. మన దేశంలో బంగారానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అత్యధికంగా కొనుగోలు చేసేది కూడా ఇదే. అయితే బంగారం కొనుగోళ్లపైనా ఇన్ కమ్ ట్యాక్స్ నిఘా ఉంటుందని మీకు తెలుసా? పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తే తప్పనిసరిగా మీ ఐడీ ప్రూఫ్ లను సమర్పించాల్సి ఉంటుంది. అలా కానీ పక్షంలో చట్ట ప్రకారం మీరు శిక్షార్హులు అవుతారు. ఈ నేపథ్యంలో అసలు బంగారం కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలేమిటి? ఎంత మొత్తంలో మాత్రమే నగదుతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా కొనుగోళ్లు చేయొచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మనీలాండరింగ్ యాక్ట్ ప్రకారం..

ముందుగా నగదు ద్వారా బంగారం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు రూపొందించిందో తెలుసుకోవాలి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), 2002 ప్రకారం నగదుతో బంగారం కొనుగోలు చేసే నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. దీని కోసం ప్రభుత్వం డిసెంబర్ 28, 2020న నోటీసు కూడా జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం, ఒక కస్టమర్ రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారాన్ని నగదు రూపంలో కొనుగోలు చేస్తే, ఆ ఖాతాదారుడి కేవైసీని అంటే అతని పాన్ లేదా ఆధార్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను నిబంధనలు ఇలా..

ఆదాయపు పన్ను చట్టాలు పేర్కొన్న పరిమితికి మించి నగదు లావాదేవీలను అనుమతించవు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం, ఒక వ్యక్తి ఒకేసారి రూ. 2 లక్షల కంటే విలువైన బంగారాన్ని చేయలేడు. ఒక వ్యక్తి ఒక్క రోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలను నగదు రూపంలో కొనుగోలు చేస్తే అది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అటువంటి లావాదేవీలలో నగదు తీసుకునే వ్యక్తి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 271డీ ప్రకారం నగదు రూపంలో లావాదేవీలు జరిపిన మొత్తానికి జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రూ. 2 లక్షల కంటే ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తే ఏం చేయాలి..

మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ బంగారం కొనుగోలు చేయాలనుకుంటే, మీరు పాన్ లేదా ఆధార్ కార్డును అందించడం తప్పనిసరి. ఆదాయపు పన్ను నిబంధనలు, 1962లోని రూల్ 114బీ ప్రకారం రూ. 2 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీల కోసం బంగారం కొనుగోళ్లకు పాన్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి.
అలాగే పీఎంఎల్ఏ నియమాలు కూడా నిర్దిష్ట పరిమితులను మించిన లావాదేవీలకు పాన్ లేదా ఆధార్‌ను తప్పనిసరి చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..