IT Returns: మీరు పిల్లల చదువులకోసం తీసుకున్న రుణాల వడ్డీపై పన్ను మినహాయింపు పొందొచ్చు.. ఎలానో తెలుసుకోండి!

|

Nov 14, 2021 | 11:12 AM

ఈ ఆర్థిక సంవత్సరానికి (2020-21)ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ని డిసెంబర్ 31లోపు దాఖలు చేయాలి. ఐటీఆర్(ITR) ఫైల్ చేయడానికి ముందు, మీరు దానిపై అందుబాటులో ఉన్న రాయితీలు లేదా మినహాయింపుల గురించి తెలుసుకోవాలి.

IT Returns: మీరు పిల్లల చదువులకోసం తీసుకున్న రుణాల వడ్డీపై పన్ను మినహాయింపు పొందొచ్చు.. ఎలానో తెలుసుకోండి!
It Rules
Follow us on

IT Returns:  ఈ ఆర్థిక సంవత్సరానికి (2020-21)ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ని డిసెంబర్ 31లోపు దాఖలు చేయాలి. ఐటీఆర్(ITR) ఫైల్ చేయడానికి ముందు, మీరు దానిపై అందుబాటులో ఉన్న రాయితీలు లేదా మినహాయింపుల గురించి తెలుసుకోవాలి. మీరు పిల్లల విద్య ఖర్చు లేదా వారి విద్య కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రముఖ టాక్స్ కన్సల్టెంట్స్ చెబుతున్న పన్ను మినహాయింపు విధానాల గురించి తెలుసుకుందాం.

మీరు విద్యా ఖర్చులపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లల చదువుపై అయ్యే ఖర్చు కోసం మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద 1.5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. మరోవైపు, మీకు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే, మీరు వారిలో ఎవరైనా ఇద్దరు పిల్లల కోసం దీనిని క్లెయిమ్ చేయవచ్చు. పూర్తి సమయం విద్య కోసం అయ్యే ఖర్చులపై మాత్రమే మీరు ఈ మినహాయింపును తీసుకోవచ్చు. ఇది కాకుండా, ఈ మినహాయింపు ట్యూషన్ ఫీజులకు మాత్రమే ఉంటుంది. ఇతర ఖర్చులకు ఉండదు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై కూడా పన్ను మినహాయింపును మీరు పొందవచ్చు. అటువంటి మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ముఖ్యమైన షరతులు ఏమిటంటే, ఒక స్త్రీ లేదా ఆమె భర్త లేదా పిల్లలు ఉన్నత విద్య (భారతదేశం లేదా విదేశాలలో) కోసం బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుండి రుణాన్ని తీసుకుని ఉండాలి. రుణం తిరిగి చెల్లించడం ప్రారంభించిన సంవత్సరం నుండి ఈ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అదేవిధంగా తదుపరి 7 సంవత్సరాలు లేదా లోన్ తిరిగి చెల్లించే సమయం వరకు, ఏది ముందుగా ఉంటే అక్కడి వరకూ మీరు పన్ను మినహాయింపు పొందుతారు.

ఒకరి కంటే ఎక్కువ పిల్లల కోసం విద్యా రుణం తీసుకోవడానికి పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ట పన్ను మినహాయింపు పరిమితి లేదు. ఉదాహరణకు, మీరు ఇప్పటికే మీ కుమార్తె కోసం విద్యా రుణం తీసుకున్నారు. దానిపై వార్షిక వడ్డీపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతున్నారని అనుకుందాం. ఇప్పుడు మీరు మీ కొడుకు చదువు కోసం కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నట్లయితే, మీరు దీనిపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

మీరు రెండింటికీ 10% వడ్డీకి 10-10 లక్షల రుణం తీసుకున్నట్లయితే, మొత్తం 20 లక్షల వార్షిక వడ్డీ 2 లక్షలు అవుతుంది. మీరు ఈ మొత్తం 2 లక్షల రూపాయల వడ్డీపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు. అంటే, మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో, ఈ మొత్తం మైనస్ అవుతుంది.

ఇవి కూడా చదవండి: Crypto Currency: అక్రమ క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి..అధికారులను కోరిన ప్రధాని మోడీ

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!