ITR Filing: ఫేక్ పాన్ కార్డుతో హెచ్‌ఆర్ఏ క్లయిమ్.. గుర్తించిన ఆదాయ పన్నుల శాఖ..

కొన్ని ప్రభుత్వ పథకాలలో పెట్టుబడులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. వాటినన్నింటినీ సక్రమంగా ఆధారాలతో సహా అందజేసి, పన్ను ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నించి ఉంటారు. ఈ క్రమంలో చాలామంది ఉద్యోగులు హెచ్ ఆర్ఏ మినహాయింపు కోసం కూడా క్లయిమ్ చేసుకుని ఉంటారు. అయితే వాటిలో చాలా మంది ఫేక్ పత్రాలు పెడుతున్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది.

ITR Filing: ఫేక్ పాన్ కార్డుతో హెచ్‌ఆర్ఏ క్లయిమ్.. గుర్తించిన ఆదాయ పన్నుల శాఖ..
Save Tax

Updated on: Apr 08, 2024 | 2:54 PM

ఆర్థిక సంవత్సరం పూర్తయింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేశారు. కొన్ని ప్రభుత్వ పథకాలలో పెట్టుబడులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. వాటినన్నింటినీ సక్రమంగా ఆధారాలతో సహా అందజేసి, పన్ను ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నించి ఉంటారు. ఈ క్రమంలో చాలామంది ఉద్యోగులు హెచ్ ఆర్ఏ మినహాయింపు కోసం కూడా క్లయిమ్ చేసుకుని ఉంటారు. అయితే వాటిలో చాలా మంది ఫేక్ పత్రాలు పెడుతున్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో హెచ్ ఆర్ ఏ ను పన్ను నుంచి మినహాయంపు కోరే వారు ఎలాంటి డాక్యుమెంట్లను పెట్టుకోవాలి? నకిలీ డ్యాక్యుమెంట్లను ఎలా పెడుతున్నారు? తెలుసుకుందాం..

హెచ్ ఆర్ఏ మినహాయింపు..

సాధారణంగా ఉద్యోగస్తులకు వారి యజమాని అందజేసే జీతంలో హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ ఆర్ ఏ) కలిపి ఉంటుంది. అద్దె ఇళ్లలో నివసించే వారందరూ ప్రతినెలా తమ ఇంటి యజమానికి అద్దె చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చే హెచ్ ఆర్ ఏపై పన్ను మినహాయింపు కోరుకుంటారు. దానికి ఐటీఆర్ లో క్లెయిమ్ కూడా చేస్తున్నారు.

నకిలీ కేసులు..

ఇటీవల కొన్ని సర్వేలలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలామంది నకిలీ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ద్వారా హెచ్ ఆర్ ఏ మినహాయింపునకు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు తెలిసింది. ఆదాయపు పన్ను శాఖ కూడా ఇలాంటి కేసులను సుమారు 8 వేల నుంచి 10 వేల వరకూ గుర్తించింది. వీటిలో కొన్ని మొత్తాలు రూ.10 లక్షలకు మించి కూడా ఉండడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

పెరిగిన నిఘా..

హెచ్ ఆర్ ఏ క్లయిమ్‌లపై అధికారులు నిఘా పెంచారు. ముఖ్యంగా అధిక ఉన్న మొత్తాలపై నిశితంగా పరిశీలన చేస్తున్నారు. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు హెచ్ ఆర్ఏ మినహాయింపు పొందాలంటే సంబంధిత పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం.

అద్దె ఒప్పందం..

మీకు, మీ ఇంటి యజమానికి మధ్య చెల్లుబాటు అయ్యే అద్దె ఒప్పందం ఉండాలి. దానిలో ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట అంశాలను తప్పనిసరిగా చేర్చాలి. ముఖ్యంగా యజమాని లేదా భూస్వామి పాన్, ఆధార్ కార్డు నంబర్లను ఐటీఆర్ లో చేర్చడం చాలా అవసరం.

రశీదులు..

ఇంటికి చెల్లించే అద్దెకు సంబంధించి రశీదులన్నీ సక్రమంగా ఉండాలి. జీతం పొందుతున్న ఉద్యోగి మొత్తం ఆర్థిక సంవత్సరానికి అద్దె చెల్లించినట్లు అవే రుజువు చేస్తాయి. నెట్ బ్యాంకింగ్ తదితర వాటి ద్వారా అద్దె చెల్లించినా రశీదులను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

భూస్వామి పాన్ కార్డ్..

మీరు ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ అద్దె చెల్లించినప్పుడు మీ యజమాని పాన్ కార్డు నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఉద్యోగి తన కంపెనీ ద్వారా హెచ్ ఆర్ఏ మినహాయింపును క్లయిమ్ చేయకపోతే, ఐటీఆర్ లో చేసుకునే వీలుంది. అలాగే కుటుంబ సభ్యులకు అద్దె చెల్లిస్తున్న వ్యక్తులు సంబంధిత డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. లేకపోతే ఆదాయపు పన్ను శాఖ హెచ్ ఆర్ఏ పన్ను మినహాయింపును తిరస్కరించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..