ITCC for Travel Abroad: అందరూ అవసరం లేదు.. వీరు మాత్రం ఇస్తే చాలు.. ట్యాక్స్ క్లియరెన్స్‌పై క్లారిటీ

|

Aug 22, 2024 | 7:54 AM

Income Tax Clearance Certificate: గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ కూడా నడుస్తోంది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ వివిధ వర్గాల ప్రజలు సైతం తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖ తాజాగా స్పందించింది. దానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడ కీలక ప్రకటన చేసింది. విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం లేదని, కొంతమంది మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని క్లారిటీనిచ్చింది.

ITCC for Travel Abroad: అందరూ అవసరం లేదు.. వీరు మాత్రం ఇస్తే చాలు.. ట్యాక్స్ క్లియరెన్స్‌పై క్లారిటీ
Income Tax
Follow us on

విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నవారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం కేంద్ర ప్రభుత్వం జూలైలో చేసిన కీలక ప్రకటన. ఎవరైనా విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడం తప్పనిసరిని చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. దీనిపై గందరగోళం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ కూడా నడుస్తోంది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ వివిధ వర్గాల ప్రజలు సైతం తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ఆదాయ పన్ను శాఖ తాజాగా స్పందించింది. దానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడ కీలక ప్రకటన చేసింది. విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం లేదని, కొంతమంది మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని క్లారిటీనిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవి..

దేశం విడిచి వెళ్లే భారతీయ పౌరులందరూ ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆదాయ పన్నుల శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు 20న ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో ఈ విధంగా పేర్కొంది. భారత పౌరులందరూ దేశం విడిచి వెళ్లే ముందు తప్పనిసరిగా ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ (ఐటీసీసీ) పొందాలని తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. అది వాస్తవం కాదని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 230 ప్రకారం ప్రకారం విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడు ట్యాక్స్‌ క్లియరెన్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని.. కొన్ని విభాగాలకు చెందిన వారే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

ఎవరు తీసుకోవాలంటే..

ఆదాయ పన్ను శాఖ చెబుతున్న దాని ప్రకారం ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ను కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన వ్యక్తులు, ప్రత్యక్ష పన్ను బకాయిలు రూ. 10లక్షలకు మించి ఉన్న వ్యక్తులు ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పన్ను చట్టాలు, సంపన్న పన్ను చట్టాల ప్రకారం దర్యాప్తు అవసరమైన, ట్యాక్స్‌ డిమాండ్‌నోటీసులు అందుకున్న వ్యక్తులు దేశం విడిచి వెళ్లాలంటే తప్పనిసరిగా ఈ ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

ఎవరు జారీ చేస్తారు..

ఈ ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ను ఆదాయపు పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ జారీ చేస్తారు. ట్యాక్స్‌ క్లియరెన్స్‌ ఎందుకు అవసరమో కారణాలు వివరించి నమోదు చేసిన తర్వాతే సర్టిఫికెట్‌ జారీ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..