Income Tax: భార్యకు భర్త గిఫ్ట్ ఇచ్చినా ట్యాక్స్ పడుతుందా.. అసలు బహుమతులు ఎవరికి ఇస్తే పన్ను పడుతుందో తెలుసా..

|

May 17, 2023 | 10:37 AM

ఐటీ శాఖ ప్రకారం రూ.50,000 కంటే ఎక్కువ ఏదైనా బహుమతి పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే బహుమతుల విషయంలో భిన్నమైన నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Income Tax: భార్యకు భర్త గిఫ్ట్ ఇచ్చినా ట్యాక్స్ పడుతుందా.. అసలు బహుమతులు ఎవరికి ఇస్తే పన్ను పడుతుందో తెలుసా..
Income Tax Rule On Gifts
Follow us on

ప్రతి సంతోషకరమైన సందర్భంలో ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటాం. ఈ బహుమతులపై ట్యాక్స్ విధించే విషయంలో జనంలో కొంత గందరగోళం నెలకొంది. భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులు లేదా వారి కుటుంబ సభ్యులకు బహుమతులు ఇచ్చినప్పుడు.. పన్ను విధించబడుతుందనే ప్రశ్న మనస్సులో ఉంటుంది. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కొన్ని నిబంధనలను రూపొందించింది. ఒక వ్యక్తి లేదా ఉమ్మడి హిందూ కుటుంబం స్వీకరించే బహుమతులపై పన్ను విధించే విషయంలో ఐటీ శాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది. ఐటీ డిపార్ట్‌మెంట్ సర్క్యులర్ ప్రకారం, గిఫ్ట్ అనేది ఎటువంటి పరిగణన లేకుండా లేదా ఏదైనా చర లేదా స్థిరాస్తి లేకుండా అందుకున్న డబ్బుగా పరిగణించబడుతుంది.

రూ. 50,000 కంటే ఎక్కువ బహుమతులపై పన్ను వర్తిస్తుంది. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో లభించే చరాస్తులు,  స్థిరాస్తులు కూడా ఈ వర్గంలోకి వస్తాయి. ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 దాటిన ఏదైనా బహుమతి పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక వ్యక్తి తన కుటుంబానికి బహుమతిగా ఇస్తే, దాని విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే.. అటువంటి పరిస్థితిలో పన్ను ఉండదు.

ఐటీ శాఖ ప్రకారం ఎవరు బంధువు కావచ్చు

  • భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతిగా ఇస్తే.. దానిపై పన్ను విధించబడదు.
  • సోదరులు లేదా సోదరిలు ఒకరికొకరు బహుమతులు ఇస్తే పన్ను ఉండదు.
  • భర్త లేదా భార్య సోదరుడు లేదా సోదరి బహుమతిగా ఇచ్చినట్లయితే ఎటువంటి పన్ను విధించబడదు.
  • భార్యాభర్తల వారసులు కూడా ఏదైనా బహుమతిగా ఇస్తే, దానిపై పన్ను విధించబడదు.

అంతే కాదు పెళ్లి సందర్భంగా వచ్చే బహుమతులపై కూడా పన్ను ఉండదని ఐటీ శాఖ తెలిపింది. మీరు పన్ను పరిధిలోకి రాని అటువంటి బహుమతిని అందుకున్నట్లయితే, దానిపై ఆదాయం వస్తున్నట్లయితే, అది పన్ను పరిధిలోకి వస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం