మారుతి సుజుకి ఇటీవలే భారత మార్కెట్‌లో స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా పండుగ సీజన్‌లో స్విఫ్ట్ కారు ద్వారా అమ్మకాలను పెంచుకునేందుకు మారుతీ సుజుకీ కంపెనీ ఈ కారును రిలీజ్ చేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మారుతీ సుజుకీ నయా ఎడిషన్ గ్రాండ్ విటారా ఎస్‌యూవీ, బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు గట్టి పోటినిస్తుందని అంచనా వేస్తున్నారు. సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ కొనుగోలుదారులకు రూ.9,500 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీ ప్యాకేజీని అందిస్తున్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ వీఎక్స్ఐ, వీఎక్స్ఐ(ఓ) అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సాధారణ వెర్షన్‌లో అందుబాటులో ఉన్న స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌తో పాటు ప్రత్యేక ఎడిషన్లో గ్రిల్ గార్నిష్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, యాక్సెసరీ ప్యాకేజీ కింద ఫ్రంట్, రియర్, సైడ్ ప్రొఫైల్‌కు అండర్ బాడీ స్పాయిలర్లతో వస్తుంది.
మారుతి సుజుకి బ్లిట్జ్ ప్రత్యేక ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీలో భాగంగా బాడీ క్లాడింగ్, విండో ఫ్రేమ్ కిట్, డోర్ వైజర్లు, బ్లాక్ రూఫ్ స్పాయిలర్‌లు ఆకట్టుకుంటాయి. ఇంక ఇంటీరియర్ విషయానికి వస్తే క్యాబిన్ లోపల మారుతి సుజుకి బ్లిట్జ్ ఎడిషన్ విలక్షణమైన స్టైల్ సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్లతో వస్తుంది. ఈ ఫీచర్లు స్విఫ్ట్‌కు సంబంధించిన ప్రామాణిక వెర్షన్ అందుబాటులో లేవు. స్పెషల్ ఎడిషన్ హ్యాచ్బ్యాక్లో తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వేరియంట్‌కు అనుగుణంగా ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌కు సంబంధించిన అనుబంధ ప్యాకేజీ ద్వారా పొందుపర్చిన మార్పులు కాస్మెటిక్, ఫీచర్ ఫ్రంట్‌కు పరిమితం చేశారు. అయితే లుక్ పరంగా మాత్రం బ్లిట్జ్ ఎడిషన్ సాధారణ మారుతీ సుజుకీ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ పెట్రోల్ మాత్రమే కాకుండా పెట్రోల్ సీఎన్‌జీ పవర్ ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 82 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 112 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లేదా ఫైవ్-స్పీడ్ ఏఎంటీ యూనిట్‌తో ఆకట్టుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి