India Economy: భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌

India Economy: గత సంవత్సరం కార్పొరేట్ లాభాలు మందగించడం మార్కెట్‌పై ఒత్తిడిని కలిగించాయి. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, స్టాక్ మార్కెట్ అస్థిరత కూడా ఒక కారణమయ్యాయి. అయితే ఇప్పుడు కార్పొరేట్ లాభాలలో మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింతగా..

India Economy: భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
India Economy Growth

Updated on: Jan 19, 2026 | 6:28 PM

India Economy: భారత వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిది (IMF) గణనీయంగా పెంచింది. ప్రస్తుత ఆర్థిక (2025-26) సంవత్సరంలో భారత్‌ 7.3% వృద్ధిని నమోదు చేస్తుందని తాజాగా అంచనా వేసింది. ఇది గత అంచనా కంటే 0.7 శాతం కంటే ఎక్కువగా ఉండటం విశేషం. మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, బలమైన ఆర్థిక ఊపు దీనికి ప్రధాన కారణాలుగా ఐఎంఎఫ్ విశ్లేషించింది. సుంకాలకు సంబంధించిన ప్రపంచ గందరగోళం ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని చూపుతోందని ఐఎంఎఫ్ బుతోంది. IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం, భారతదేశం 2025-26 జీడీపీ వృద్ధి రేటు అంచనాను 0.7 శాతం పాయింట్లు పెంచి 7.3 శాతంగా పేర్కొంది.

మూడవ త్రైమాసికంలో కార్పొరేట్ ఆదాయాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయని, నాల్గవ త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఊపు కనిపించిందని నివేదిక పేర్కొంది. అయితే తాత్కాలిక, ఇతర కారకాలు బలహీనపడటం వల్ల 2026, 2027లో భారతదేశ వృద్ధి 6.4 శాతానికి కొద్దిగా తగ్గవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.

ఇది కూడా చదవండి: Bank Loan: SBI నుండి రూ.40 లక్షల హోమ్‌ లోన్‌ కోసం మీకు ఎంత జీతం ఉండాలి? నెలవారీ EMI ఎంత?

ఇవి కూడా చదవండి

అయితే 2026,2027 క్యాలెండర్ సంవత్సరాల్లో భారత ఆర్థిక వృద్ధి రేటు వరుసగా 6.3 శాతం, 6.5 శాతంంగా ఉండవచ్చని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. కాగా, అంతర్జాతీయ వృద్ధి రేటు 2026లో 3.3 శాతం, 2027లో 3.2 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. 2025లో ఇది 3.3 శాతంగా ఉండవిచ్చని ఐఎంఎఫ్ అంచనా.

గత సంవత్సరం కార్పొరేట్ లాభాలు మందగించడం మార్కెట్‌పై ఒత్తిడిని కలిగించాయి. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, స్టాక్ మార్కెట్ అస్థిరత కూడా ఒక కారణమయ్యాయి. అయితే ఇప్పుడు కార్పొరేట్ లాభాలలో మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని, మార్కెట్‌కు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని IMF విశ్వసిస్తోంది. ఈ మెరుగుదల భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కోలుకునే ప్రారంభ సంకేతాలను సూచిస్తుంది.

ఇది కూడా చదవండి: Home Loan: ఈ ఒక్క పని చేస్తే రూ.50 లక్షల రుణంపై రూ.18 లక్షలు ఆదా.. బ్యాంకర్లు కూడా ఆశ్చర్యపోతారు!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో AI కీలక పాత్ర:

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రకారం.. US సుంకాలు, వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలాన్ని ప్రదర్శించింది. ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి 3.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది అక్టోబర్ అంచనా కంటే 0.2 శాతం ఎక్కువ. AIలో పెరుగుతున్న పెట్టుబడి ఈ బలానికి ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. యూఎస్‌లో IT, AI పెట్టుబడి 2001 నుండి అత్యధిక స్థాయికి చేరుకుంది. ఇది ఆసియా టెక్ ఎగుమతులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతోంది.

2025లో 4.1 శాతంగా ఉన్న ప్రపంచ ద్రవ్యోల్బణం 2026లో 3.8 శాతానికి, 2027లో 3.4 శాతానికి తగ్గవచ్చని IMF అంచనా వేసింది. ఆహార ధరలు తగ్గడం వల్ల భారతదేశంలో కూడా ద్రవ్యోల్బణం లక్ష్యానికి దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే AI రంగంలో అధిక విలువలు, US స్టాక్ మార్కెట్‌లో క్షీణత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ ప్రమాదాలుగానే ఉన్నాయని ఐఎంఎఫ్‌ హెచ్చరిస్తోంది. ఈ అంశాలు ప్రపంచ మార్కెట్లు, వడ్డీ రేట్లపై ఒత్తిడిని కలిగిస్తాయి.

Investment Plan: ఈ ఫండ్‌ అద్భుతం చేసింది.. రూ.10 లక్షల పెట్టుబడిని రూ.37 లక్షలుగా మార్చింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి