లోన్ తీసుకున్నవారికి హెచ్చరిక.. టైమ్‏కు EMI కట్టకపోతే ఇక అంతే సంగతులు. .. భారీగా ఛార్జీలు..

|

May 21, 2021 | 5:16 PM

మనకు అవసరమైన పరిస్థితుల్లో మన సన్నిహితుల వారి దగ్గర అప్పులు చేస్తుంటాం. లేదా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటుంటాం. ఇక వాటిని ప్రతి నెల కొద్ది కొద్దిగా చెల్లిస్తూ ఉంటాం.

లోన్ తీసుకున్నవారికి హెచ్చరిక.. టైమ్‏కు EMI కట్టకపోతే ఇక అంతే సంగతులు. .. భారీగా ఛార్జీలు..
Bank Charges
Follow us on

మనకు అవసరమైన పరిస్థితుల్లో మన సన్నిహితుల వారి దగ్గర అప్పులు చేస్తుంటాం. లేదా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటుంటాం. ఇక వాటిని ప్రతి నెల కొద్ది కొద్దిగా చెల్లిస్తూ ఉంటాం. దానిని ఈఎంఐ అంటారు. ప్రతి నెల తీసుకున్న లోన్‏కు కొద్దిగా డబ్బులు కడుతూ ఉంటాం. అయితే ఇలా ఈఎంఐ చెల్లించేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదెంటంటే.. ఇక నుంచి లోన్ డబ్బులను కరెక్ట్ టైంకి కట్టాలి. అలాగే ప్రతి నెలా ఈఎంఐ సరైన సమయానికి కట్ అవుతూ ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈఎంఐ మిస్ అయితే రుణ గ్రహీతలకు చుక్కలు కనిపిస్తాయి.

వివరాల్లోకెలితే.. ఒక్క నెల కరెక్ట్ టైంకు ఈఎంఐ కట్టకపోతే.. భారీ ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాదాపు రూ.750 వరకు ఛార్జీలు పడతాయి. అందువలన మీరు ప్రతి నెల కరెక్ట్ టైంకు ఈఎంఐ కట్టాలి. బ్యాంక్ అకౌంట్ లో లోన్ ఈఎంఐకి సరిపడా డబ్బులు ఉండేలా చూసుకోవాలి. లేదంటే మళ్లీ రూ. 750 అదనంగా బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక బ్యాంకు ప్రాతిపదికన వసూలు చేసే ఛార్జీలు కూడా మారుతూ ఉంటాయి. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అయితే రూ. 500 కు ఛార్జీలు వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అయితే రూ. 350 నుంచి రూ.750 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే ఈ ఈఎంఐ ఛార్జీలు ప్రభుత్వ బ్యాంకుల కన్నా ప్రైవేట్ బ్యాంకుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఉంటే .. సరైన సమయానికి ఈఎంఐ కట్టేలా చూసుకోండి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకవేళ ఒక నెల మిస్ చేస్తే.. క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.

Also Read: నిద్ర పట్టడం లేదా ? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే.. క్షణాల్లో గురకపెట్టి మరీ నిద్రపోతారు

International Tea Day 2021: అంతర్జాతీయ టీ దినోత్సవం.. ఒత్తిడిని, నొప్పుల్ని తగ్గించే ఇలాచి టీతో ఎన్నో ప్రయోజనాలు..